Jio Fiber P‌lans: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్, సోనిలివ్ ఓటీటీలు ఉచితం జియో ఫైబర్‌లో ఈ ప్లాన్స్ తీసుకుంటే

Jio Fiber Plans: రిలయన్స్ జియోనే కాదు జియో ఫైబర్ కూడా అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తోంది. హైస్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు ఉచితంగా ఓటీటీ సేవలు పొందే అవకాశం కూడా కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2023, 02:49 PM IST
Jio Fiber P‌lans: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్, సోనిలివ్ ఓటీటీలు ఉచితం జియో ఫైబర్‌లో ఈ ప్లాన్స్ తీసుకుంటే

Jio Fiber Plans: టెలీకం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్ జియో ఇప్పుడు ఫైబర్‌లో తనదైన ముద్ర వేస్తోంది. ఆకర్షణీయమైన పథకాలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే జియో ఫైబర్ అద్భుతమైన ప్లాన్ తీసుకొస్తోంది. ఆ ప్లాన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఫైబర్ ఇంటర్నెట్ రంగంలో జియో దూసుకుపోతోంది. ఆకర్షణీయమైన పథకాలతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. కస్టమర్లకు ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఉచితంగా ఓటీటీ సేవలు కూడా ఆఫర్ చేస్తోంది. అంటే జియో పైబర్ ప్లాన్ తీసుకుంటే హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా కలగనున్నాయి. ఉచితంగా అందించే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో మీ డబ్బులు ఆదా అవుతున్నాయి. జియో ఫైబర్ ఇలాంటి ప్లాన్లనే అందిస్తుంది. ఫైబర్ కనెక్షన్‌తో పాటు ఫ్రీ ఓటీటీ సేవలు అందనున్నాయి. జియో ఫైబర్ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

జియో ఫైబర్ 1499 రూపాయల ప్లాన్ ఇది ఇందులో 300 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. దాంతోపాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్‌ ఎన్ఎక్స్‌టి, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఏఎల్టీ బాలాజీ, హోయిచోయి, శెమారూమీ, లైన్స్‌గేట్ ప్లే వంటి ఓటీటీలు పూర్తిగా ఉచితంగా అందనున్నాయి. ఈ ప్లాన్ నెల రోజుల వ్యవధితో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ మాత్రం మొత్తం ఏడాదికి లభిస్తుంది. దాంతోపాటు ఉచితంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కలుగుతుంది. 

ఇక రెండవది జియో ఫైబర్ 2499 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్‌లో 500 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఈ ప్లాన్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ ఎన్ఎక్స్‌టి, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఏఎల్‌టి బాలాజీ, హోయిచోయి, షెమారూమీ, లైన్స్‌గేట్ ప్లే వంటి ఓటీటీ సేవలు ఉచితంగా అందుతాయి. దాంతోపాటు ఉచితంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది.

ఇక మూడవ ప్లాన్ జియో ఫైబర్ 3499. ఈ ప్లాన్‌లో 1 జీబీపీఎస్ స్పీడ్ అంటే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ లభిస్తుంది. దాంతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ కూడా నెల రోజులకే ఉంటుంది. 

ఇక నాలుగవ ప్లాన్ జియో ఫైబర్ 8499 రూపాయలు. ఇందులో కూడా 1 జీబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. దాంతోపాటు 600 జీబీ డేటా పొందవచ్చు. ఉచితంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ ఎన్ఎక్స్‌టి, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఏఎల్టీ బాలాజీ, హోయిచోయి, శెమారూమీ, లైన్స్‌గేట్ ప్లే  సహా ఇతర ఓటీటీ సేవలు ఉచితంగా లభిస్తాయి. దీని వ్యాలిడిటీ కూడా నెల రోజులు. 

Also read: Stock Market Updates: స్టాక్ మార్కెట్‌లో భారీ డివిడెండ్ రాబడి ఇచ్చే షేర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News