Pharma Stock : ఈ ఫార్మా స్టాక్ కొనమని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సిఫార్సు చేసింది..టార్గెట్ ఎంతంటే..?

Motilal Oswal Pharma Stock: స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించేందుకు మీరు ఆతృతగా ఉన్నారా..అయితే ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సంస్థ వారు చక్కటి పెర్ఫార్మెన్స్ అందిస్తున్న ఓ ఫార్మా కంపెనీ స్టాక్ సిఫార్సు చేశారు. ఈ స్టాక్ టార్గెట్ ఎంత వరకూ ఉందో తెలుసుకుందాం.

Written by - Bhoomi | Last Updated : Aug 19, 2024, 07:50 PM IST
Pharma Stock : ఈ ఫార్మా స్టాక్ కొనమని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సిఫార్సు చేసింది..టార్గెట్ ఎంతంటే..?

Motilal Oswal Pharma Stock: స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడమే మీ లక్ష్యమా.. అయితే చక్కటి స్టాక్స్ ని ఎంపిక చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే, మీకు లాంగ్ టైం లో మంచి లాభాలు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం మోతిలాల్ ఉస్వాల్ బ్రేకరిది సంస్థ సిఫార్సు చేసిన ఓ ఫార్మా స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్లెన్ మార్క్ ఫార్మాస్యుటికల్స్ ఈ సంస్థ గడచిన ఐదు సంవత్సరాలుగా మల్టీ బ్యాగర్ లాభాలను అందించింది.

 2019 వ సంవత్సరం ఆగస్టు నెలలో ఈ స్టాక్ ధర రూ. 360 సమీపంలో ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర 342 శాతం పెరిగి 1630 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. గడచిన ఒక సంవత్సర కాలంగా గమనించినట్లయితే ఈ స్టాకు దాదాపు రెండింతలు అయింది. గత సంవత్సరం ఆగస్టు 21వ తేదీన ఈ స్టాక్ ధర 775 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఆగస్టు 19వ తేదీ నేడు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈ స్టాక్ ధర 1630 రూపాయల వద్ద ఉంది. అంటే దాదాపు 110% రిటర్న్ అందించింది అని అర్థం. అయితే ప్రస్తుతం ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది.

Also Read : Reproduction Without Mating: జంతు ప్రపంచంలో సంభోగం లేకుండా జన్మనిచ్చే  జీవులు ఏవో తెలుసా

బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ గ్లెన్‌మార్క్ ఫార్మా రేటింగ్‌ను మార్చింది. ఇది సంస్థ  రేటింగ్‌ను "న్యూట్రల్" నుండి "బయ్యింగ్"కి అప్‌గ్రేడ్ చేసింది.  టార్గెట్ ధరను రూ. 1,200 నుండి రూ.1,850కి పెంచింది. కాగా, ఈరోజు ఆగస్టు 19వ తేదీ సోమవారం కంపెనీ షేర్లు రూ.63.40 చొప్పున 4.05 శాతం లాభపడి రూ.1628.10కి చేరాయి. కొత్తగా నిర్ణయించి కంపెనీ టార్గెట్ రూ. 1850 కోసం, ఇది ప్రస్తుత ధర నుండి 13.6 శాతం రాబడిని అందివ్వాలి.

నిరంతర వృద్ధిని అంచనా వేసింది:

బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్, కీలక మార్కెట్లలో వృద్ధి కారకాలను హైలైట్ చేస్తూ, కంపెనీ మొత్తం పనితీరులో నిరంతర వృద్ధిపై ఆశాభావం వ్యక్తం చేసింది. అదనంగా, దేశీయ మార్కెట్‌లో వృద్ధికి తోడ్పడటానికి కంపెనీ దాని పంపిణీ, ఇన్-లైసెన్సింగ్, కొత్త లాంచ్‌ల సిద్ధం చేసింది.

త్రైమాసిక ఫలితాలు ఎలా ఉన్నాయి?

గ్లెన్‌మార్క్ ఫార్మా క్యూ1ఎఫ్‌వై25లో రూ.3,244 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది, గత ఏడాది ఇదే కాలంలో రూ.3,036 కోట్లుగా ఉంది. ఇది ఏడాది ప్రాతిపదికన 6.9 శాతం పెరిగింది. దీని లాభం FY24 జూన్ త్రైమాసికంలో రూ.370 కోట్లతో పోలిస్తే 12.38% తగ్గి రూ.340 కోట్లుగా ఉంది.

Also Read : Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!  

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News