New Rules Change: డిసెంబరు 1వ తేదీ నుంచి కీలక మార్పులు..G mail ఖాతాదారులకు భారీ షాక్..

Rules Change From 1 December 2023: ప్రతి నెల కొన్ని అంశాలకు సంబంధించిన కొత్త రూల్స్ మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు ఇతర వస్తువుల్లో రేట్లలో మార్పులు చేర్పులు వస్తాయి. కాబట్టి ఇలాంటి అంశాలు సామాన్యులపై భారం పడతాయి. ఈ నెలలో ఏయే అంశాల్లో మార్పులు వచ్చాయే మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2023, 10:49 AM IST
New Rules Change: డిసెంబరు 1వ తేదీ నుంచి కీలక మార్పులు..G mail ఖాతాదారులకు భారీ షాక్..

 

Rules Change In December 2023: ప్రస్తుతం మనమంతా నవంబర్ నెల నుంచి డిసెంబర్ నెలలోకి అడుగుపెట్టాం. ప్రతి సంవత్సరంలో కొత్త నెల ప్రారంభంలోనే కొత్త రూల్స్ ప్రారంభం కావడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని కొత్త రూల్స్ కూడా ప్రతి నెల ఒకటవ తేదీన అమల్లోకి వస్తాయి. అయితే డిసెంబరు ఒకటవ తేదీన కొన్ని రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. సిలిండర్ ధరల నుంచి మొదలుకొని ఎలక్ట్రిక్ బైక్ ల వరకు ప్రతి ఒక్క అంశానికి సంబంధించిన మార్పులు చేర్పులు కొత్త రూల్స్ తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రూల్స్ మారడం కారణంగా కొన్నిసార్లు సామాన్యుడిపై భారం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో ఏయే అంశాల్లో రూల్స్ మారతాయో, కొత్తగా అమల్లోకి వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

బ్యాంకు లోన్స్‌పై కొత్త రూల్స్: 
ప్రతి నెల ప్రారంభంలోని బ్యాంకు లోన్స్ తోపాటు బ్యాంకింగ్ రంగంలో చిన్న చిన్న మార్పులు వస్తాయి.  అయితే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి లోన్ సంబంధిత నియమాల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్పులను తీసుకువచ్చింది. ఆర్బిఐ మార్చిన కొత్త రూల్స్ ప్రకారం.. ఎవరైనా ఒక వ్యక్తి బ్యాంకు లోన్ తీసుకున్న తర్వాత ఆ రుణాన్ని తిరిగి చెల్లించని వారి ఆస్తులను నెలలోపు బ్యాంక్ తిరిగి ఆధీనం చేసుకుంటుందని తెలిపింది. ఇవే రుణాలను ఆలస్యంగా చెల్లిస్తే బ్యాంకులకు రూ.5000 చొప్పున జరిమానా తప్పకుండా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

LPG గ్యాస్ సిలిండర్:
గత నెలలో చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను ఒక్కసారిగా పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో చమురు సంస్థలు మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. కమర్షియల్ సిలిండర్ లపై దాదాపు రూ.12 పాటు పెంచుతున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. సిలిండర్లపై పెరిగిన దారులు ఈ నెలలోనే సామాన్ల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇదే నెలలో మరోసారి సిలిండర్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

G-mailలో కొత్త రూల్స్ ఇవే:
గూగుల్ తన  G-mail అకౌంట్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 1 నుంచి పాత జిమెయిల్ అకౌంట్ అని తొలగించుతున్నట్లు వెల్లడించింది. గత రెండు సంవత్సరాల నుంచి వినియోగంలో లేని జిమెయిల్ ఖాతాలన్నిటిని అతి త్వరలోనే తొలగించబోతున్నట్లు నోటిఫికేషన్ ద్వారా పేర్కొంది. కాబట్టి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వినియోగంలో లేని G-mail అకౌంట్ అన్ని తొలగిపోనున్నాయి. కాబట్టి మీరు పాత జిమెయిల్ లో భద్రపరుచుకున్న స్టోరేజ్ ని పొందడానికి తప్పకుండా మీ ఈమెయిల్ ఖాతాలను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై కొత్త రూల్స్:
HDFC  బ్యాంక్ రెగాలియా క్రెడిట్ కార్డు నిబంధనలను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మార్చబోతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ముఖ్యంగా ఈ కార్డు వినియోగిస్తున్న వారికోసం కొత్తగా లాంజ్ యాక్సెస్ సేవలను అందించబోతున్నట్లు వెల్లడించింది. ప్రతి మూడు లాంజ్ సేవలను వినియోగించుకోవాలనుకునేవారు తప్పకుండా సంవత్సరంలో రూ.1 లక్షకుపైగా ఈ క్రెడిట్ కార్డుతో బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ పేర్కొంది. ఇక మాస్టర్ కార్డు వినియోగిస్తున్న వారు సంవత్సరంలో రెండుసార్లు రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News