Sim Card Rules: ఇప్పుడు అలాంటివే ఈ కొత్త నిబంధనలు. డిసెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. సిమ్ కార్డు క్రయ విక్రయాలు, సిమ్ కార్డు మార్చుకోవడం ఇలా సిమ్ కార్డు సంబంధిత పనులకు కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తాయి. సాధారణ ప్రజలు ఈ కొత్త రూల్స్ తెలుసుకోవల్సిన అవసరం ఉంది.
సిమ్ కార్డు నిబంధనల్లో మార్పు
సైబర్ ఫ్రాడ్, నకిలీ సిమ్ వ్యవహార్ని అరికట్టేందుకు ప్రభుత్వం సిమ్ కార్డుల విషయంలో కొత్త నిబంధనల్ని ప్రవేశపెట్టింది. మోసాలు నియంత్రించడం ద్వారా సాధారణ పౌరులకు రక్షణ కల్పించడం ఈ కొత్త నిబంధనల వెనుక ఉద్దేశ్యం.
నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా సిమ్ కార్డు తీసుకుంటున్నవారిని అరికట్టేందుకు లేదా నియంత్రించేందుకు ఈ కొత్త నిబంధనలు దోహదపడతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే 10 లక్షల వరకూ జరిమానా ఉంటుంది.
సిమ్ కార్డు క్రయ, విక్రేతలిద్దరూ అంటే కస్టమర్, సెల్లర్ ఇద్దరికీ వెరిఫికేషన్ ప్రక్రియ తప్పనిసరి. కస్టమర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఇకపై విక్రేతలకు తప్పనిసరి కానుంది. అదే విధంగా సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ విధిగా ఉండాల్సిందే.
సిమ్ కార్డు డీయాక్టివేట్ అయితే మరో వ్యక్తికి 90 రోజుల తరువాతే ఆ నెంబర్ కేటాయించడం జరుగుతుంది.
ఒక్కొక్క వ్యక్తికి జారీ చేసే సిమ్ కార్డులపై పరిమితి విధించారు. కొత్త నిబంధనల ప్రకారం వెరిఫికేషన్ అనంతరం ఒక్కొక్కరికి 9 సిమ్ కార్డులే జారీ చేస్తారు. వెరిఫికేషన్ అనేది ఆధార్, డెమోగ్రఫిక్ డేటా ఆధారంగా ఉంటుంది. సిమ్ కార్డు కావాలంటే ఇకపై ఇది తప్పనిసరి.
సిమ్ కార్డు డీలర్లు ఏదైనా అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే సంబంధిత టెలీకం ఆపరేటర్‌తో సంబంధాలు తెగిపోతాయి. మూడేళ్లపాటు నిషేధం ఉంటుంది. నవంబర్ 30లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేని సిమ్ వెండర్లకు జరిమానా ఉంటుంది.
వ్యాపార నిమిత్తం లేదా ఇతర అవసరాలకు బల్క్‌లో అంటే పెద్దమొత్తంలో సిమ్ కార్డులు పొందాలంటే ఆ ప్రక్రియ మరింత కఠినతరం కానుంది.
దేశవ్యాప్తంగా 52 లక్షల ఫ్రాడ్ కనెక్షన్లు, 67 వేలమంది డీలర్లను బ్లాక్ చేసినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook