New Tata Harrier And Safari Price: టాటా నుంచి కొత్త ఫీచర్స్‌తో హారియర్, సఫారిలు..ఫీచర్స్‌, ధర, మైలేజ్ వివరాలు!

New Tata Harrier And Safari Price On Road: టాటా కంపెనీ మరో సారి  టాటా హారియర్, టాటా సఫారిలను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వీటికి సంబంధించిన అప్డేట్‌ చేసిన ఫీచర్స్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ కార్లకు సంబంధించిన మరిన్ని ఫీచర్స్‌ మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2023, 04:45 PM IST
New Tata Harrier And Safari Price: టాటా నుంచి కొత్త ఫీచర్స్‌తో  హారియర్, సఫారిలు..ఫీచర్స్‌, ధర, మైలేజ్ వివరాలు!

New Tata Harrier And Safari Price On Road: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న టాటా మోటార్స్ SUV నెక్సాన్  ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ మార్కెట్‌లోకి రానే వచ్చేసింది. టాటా ICE EV మోడల్‌ వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఎస్‌యూవీ ఎన్నో అధునాత ఫీచర్స్‌ని కలిగి ఉంటుందని కంపెనీ వల్లడించింది. అయితే కంపెనీ అతి త్వరలోనే అప్డేట్‌ ఫీచర్స్‌తో టాటా హారియర్, టాటా సఫారిలను కూడా విడుదల చేయబోతోంది. ఈ రెండు SUV వేరియంట్స్‌కి సంబంధించిన అన్ని వివరాలను వచ్చే నెలలో కంపెనీ విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ కార్ల తయారికి సంబంధించిన పనులను ఇప్పటికే పూణెలోని ప్లాంట్ ప్రారంభించిదని సమాచారం. 

టెక్నికల్ స్పెసిఫికేషన్స్:
త్వరలోనే విడుదల కాబోయే టాటా సఫారి, హారియర్ ఇంజన్‌లో అనేక రకాల మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రాబోయే మోడల్‌ క్రియోటెక్ 2.0 లీటర్ 4సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్‌ 168 బిహెచ్‌పి, 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. వీటి ఇంజన్‌ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

SUVల బాడీలో కూడా చాలా రకాల మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో చేసిన మోడల్‌లో ఉన్న కర్వ్ కాన్సెప్ట్‌లో ఈ రెండు SUVలు రాబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు అప్డేటెడ్‌ రివైజ్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌, రివైజ్డ్ ఫ్రంట్, రియర్ బంపర్‌లను కలిగి ఉంటాయి. ఇక అల్లాయ్ వీల్స్‌ సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

ఇక ఇంటీరియర్ విషయానికొస్తే..ఈ రెండు SUVలు నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హారియర్, సఫారి పెద్ద 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను కలిగి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు టచ్ ఆధారిత HVAC కంట్రోల్‌ను కూడా కంపెనీ అందిచబోతోంది. రెండు మోడల్‌లు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుంది. 

ఇతర ఫీచర్లు:
పనోరమిక్ సన్‌రూఫ్
యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్
360-డిగ్రీ కెమెరా
ఆపిల్ కార్‌ప్లే
వైర్‌లెస్ ఛార్జర్
ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్
ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్
లేన్ డిపార్చర్ వార్నింగ్
ఆటో హై బీమ్ అసిస్ట్

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News