Nexon Price: 7 ఏళ్లలో 7 లక్షల విక్రయాలు.. టాటా నెక్సాన్‌పై బంఫర్‌ తగ్గింపు..

Tata Nexon: టాటా నెక్సాన్ విక్రయాల్లో దూసుకుపోతోంది. కేవలం 7 సంవత్సరాల్లోనే దాదాపు 7 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించిన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 17, 2024, 04:04 PM IST
Nexon Price: 7 ఏళ్లలో 7 లక్షల విక్రయాలు.. టాటా నెక్సాన్‌పై బంఫర్‌ తగ్గింపు..

Tata Nexon Hits 7 Lakh Sales: ప్రస్తుతం భారత మార్కెట్‌లో గ్లోబల్ NCAP 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన కార్లకు మంచి డిమాండ్‌ ఉంది. చాలా మంది కార్లు కొనే క్రమంలో ప్రీమియం ఫీచర్స్‌తో పాటు 5 స్టార్‌ రేటింగ్ ఉన్న స్మార్ట్‌ కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ కార్ల విక్రయాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా అతి తక్కువ ధరలోనే NCAP నుంచి 5-స్టార్ రేటింగ్‌ కార్లను తయారు చేసి మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తున్నాయి. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన 5-స్టార్ రేటింగ్‌ Nexon.ev కారుకు మార్కెట్‌లో మంచి గుర్తింపు లభిస్తుంది. టాటా లాంచ్‌ చేసిన ఆప్డేట్‌ వేరియంట్‌ మోడల్‌ మార్కెట్‌లో దూసుకుపోతోంది. క్రమంగా వీటి డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు మార్కెట్‌లో ఈ కారు ట్రెండింగ్‌ ఉందంటే నమ్మసక్యంగా లేదు కద.. గత రెండు సంవత్సరాల్లో ఈ కారు సంబంధించిన విక్రయాలు దాదాపు 3 లక్షలకు పైగా జరిగాయి. గణాంకాల వారిగా ఈ కారుకు సంబంధించిన విక్రయాలు చూస్తే..

టాటా కంపెనీ Nexon కార్ల సంబంధించిన విక్రయాల వివరాల్లోకి వెళితే, 2019 సంవత్సరంలో ఆగస్టు వరకు కంపెనీ దాదాపు  1 లక్షకు పైగా విక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక 2021 సంవత్సరం మే నెల వరకు 2 లక్షలు,  2022 సంవత్సరం మార్చి వరకు 3 లక్షలు విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఇక అక్టోబర్ 2022 నాటికి 4 లక్షలు, ఏప్రిల్ 2023 ఏడాది నాటికి 5 లక్షలకుపైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో పాటు 2023 సంవత్సరం డిసెంబర్ నాటికి 6 లక్షలు, జూలై 2024కి  7 లక్షల విక్రయాలు జరిగాయి. 

ఇప్పటికే టాటా కంపెనీ  7 లక్షల విక్రయాలు దాని సందర్భంగా ప్యాసింజర్ వాహనాల డీలర్ల సంబంధించి షోరూమ్‌లు ప్రత్యేక ఈవెంట్‌లు ఏర్పాటు చేశాయి. అలాగే Nexonకు సంబంధించిన కొన్ని కార్ల మోడల్స్‌పై దాదాపు 1 లక్ష వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. దీంతో పాటు కంపెనీ కార్లపై అద్భుతమైన ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ప్రముఖ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ టాటా కార్లు ఎంతో శక్తివంతమైనవని అందులో 2017లో లాంచ్ నెక్సాన్ డిజైన్ పరంగా ఎంతో గుర్తింపు సాధించిందన్నారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

పవర్‌ట్రెయిన్‌ల పరంగా ఈ కారు ఎంతో శక్తివంతమైనదని ఆఫీసర్ వివేక్ శ్రీవత్స అన్నారు.  ఏడు సంవత్సరాల నుంచి 7 లక్షలకుపైగా విక్రయించి మైలురాయి విజయాన్ని సాధించిన నెక్సాన్ కుటుంబానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇప్పటి నుంచి ఈ కారును కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ కారును అత్యంత తగ్గింపు ధరతో అందించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్‌ను కూడా అందించబోతున్నట్లు తెలిపారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News