Fastag kyc: ఫాస్టాగ్ కేవైసీ చేయించారా, మరో వారం రోజులే గడువు

Fastag kyc: హైవే ప్రయాణాలు చేసేవారికి కీలకమైన గమనిక ఇది. నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా జారీ చేస్తోంది. ఫాస్టాగ్ విషయంలో ఎన్‌హెచ్ ఏఐ అప్‌డేట్ జారీ చేసింది. మరో వారం రోజుల్లో తప్పక చేయాల్సిన పని ఇది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 25, 2024, 03:02 PM IST
Fastag kyc: ఫాస్టాగ్ కేవైసీ చేయించారా, మరో వారం రోజులే గడువు

Fastag kyc: ఫాస్టాగ్ కేవైసీ గడువు సమీపిస్తోంది. మార్చ్ 31 అంటే మరో వారం రోజుల్లో మీ వాహనం ఫాస్టాగ్‌కు సంబంధించిన కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ప్రతి వాహనం ఫాస్టాగ్ కేవైసీ ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తప్పనిసరి చేసింది. మరో 8 రోజులు మాత్రమే వ్యవధి మిగిలింది. 

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన అప్‌డేట్స్ ప్రకారం మార్చ్ 31లోగా ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఇంకో  వారం రోజులే వ్యవధి మిగిలింది. ఎన్‌హెచ్‌ఏఐ జారీ చేసిన వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్‌లో భాగంగా ప్రతి వాహనం ఫాస్టాగ్ కేవైసీ ఇక తప్పనిసరిగా మారింది. ఒక ఫాస్టాగ్ మరో వాహనానికి ఉపయోగించకూడదు. అందుకే ఎన్‌హెచ్‌ఏఐ ఎప్పటికప్పుడు కేవైసీ అప్‌డేట్ కోరుతుంటుంది. మార్చ్ 31లోగా ఫాస్టాగ్ ఎక్కౌంట్ కేవైసీ పూర్తి చేయకుంటే ఆ ఎక్కౌంట్ ఇనాక్టివ్ కాగలదు. 

జాతీయ రహదారులపై వాహనాల నుంచి టోల్ వసూలు చేసే ఎలక్ట్రానిక్ పద్ధతి ఫాస్టాగ్. వాహనం ముందుభాగంలో అద్దంపై ఉండే ఫాస్టాగ్‌ కు లింక్ అయిన బ్యాంక్ ఎక్కౌంట్ నుంచి  లేదా ప్రీపెయిడ్ విదానం ద్వారా ఆర్ఎఫ్ఐడీ విధానంతో డబ్బులు కట్ అవుతుంటాయి.

ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్ కేవైసీ ఎలా చేయాలి

ముందుగా ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో ధృవీకరించుకోవాలి. ఇప్పుడు మై ప్రొఫైల్ క్లిక్ చేసి అందులో కేవైసీ ట్యాబ్ ప్రెస్ చేయాలి. అక్కడ అడిగిన సమాచారం నమోదు చేసి సబ్మిట్ చేస్తే చాలు..ఫాస్టాగ్ కేవైసీ పూర్తవుతుంది. దీనికోసం కారు ఆర్‌సి అవసరమౌతుంది. ఐడీ ప్రూఫ్ , అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఐడీ, అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ , పాన్‌కార్డ్‌లలో ఏదైనా వినియోగించవచ్చు.

ఫాస్టాగ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి

ముందుగా  fastag.ihmcl.com. ఓపెన్ చేయాలి. మీ మొబైల్ నెంబర్, ఓటీపీతో లాగిన్ కావాలి. ఇప్పుడు మై ప్రొఫైల్ క్లిక్ చేసి కైవైసీ స్టేటస్ చెక్ ఎంచుకోవాలి. స్టేటస్ ఏంటనేది స్క్రీన్‌పై కన్పిస్తుంది. ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా ఫాస్టాగ్ కేవైసీ చేయించుకోవచ్చు. దీనికోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లి కేవైసీ అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. 

Also read: FD Interest Rate: ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న మూడు బ్యాంకులు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News