Pan Card Reprint: పాన్ కార్డు వివరాలు చెరిగిపోయాయా, ఆన్‌లైన్‌లో కొత్తది ఇలా రీ ప్రింట్ చేసుకోవచ్చు

Pan Card Reprint: ప్రస్తుతం ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్ కార్డు కూడా అంతే అవసరం. బ్యాంకు సంబంధిత లావాదేవీలకు పాన్ కార్డు ప్రతి ఒక్కరూ కలిగి ఉండటం తప్పనిసరిగా మారుతోంది. పాన్ కార్డును అతి ముఖ్యమైన ఐడీ కార్డుగా గుర్తించడంతో ప్రాధాన్యత మరింతగా పెరిగింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2024, 07:49 AM IST
Pan Card Reprint: పాన్ కార్డు వివరాలు చెరిగిపోయాయా, ఆన్‌లైన్‌లో కొత్తది ఇలా రీ ప్రింట్ చేసుకోవచ్చు

Pan Card Reprint: అయితే ఎప్పుడో గతంలో తీసుకున్న పాన్ కార్డులు కాలక్రమంలో ఫేడ్ అవుతుంటాయి. కార్డుపై ఉన్న వివరాలు సరిగ్గా కన్పించవు. జిరాక్స్ తీస్తే అసలు కన్పించకుండా పోతుంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి పాన్ కార్డు కోసం మళ్లీ అప్లై చేయాలా లేక అదే పాన్ కార్డును రీ ప్రింట్ చేసుకోవచ్చా, ఆ వివరాలు తెలుసుకుందాం.

పాన్ కార్డు విషయంలో చాలా వెసులుబాటు ఉంది. పాన్ కార్డు పోతే డూప్లికేట్ పాన్ కార్డు ఎలా పొందవచ్చో పాన్ కార్డు ఫేడ్ అయితే రీ ప్రింట్ ఆప్షన్ ఉంది. అంటే పాత వివరాలే కొత్తగా ప్రింట్ అయి కార్డు జారీ అవుతుంది. ఇదంతా కేవలం ఆన్‌లైన్‌లో చేయవచ్చు. అంటే కొత్తగా ఎలాంటి మార్పుల్లేకుండా కేవలం పాత వివరాలతోనే కొత్త కార్డు పొందవచ్చు. పాన్ కార్డులో మార్పులు చేయదలిస్తే దానికి వేరే మార్గముంటుంది. మార్పులు అవసరం లేకుండా కొత్త కార్డు కావాలంటే మాత్రం చాలా సులభంగా ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ విధానంలో పాన్ కార్డు రీ ప్రింట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం

ముందుగా సంబంధిత అధికారిక వెబ్‌సైట్ https://www.pan.utiitsl.com/ ఓపెన్ చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ సంస్థ. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తరువాత పాన్ కార్డు రీ ప్రింట్ ఆప్షన్ కోసం కిందకు స్క్రోల్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్‌పై కన్పించే రీ ప్రింట్ పాన్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీ పాన్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తరువాత క్యాప్చా ఎంటర్ చేయాలి. వివరాలు అన్నీ సబ్మిట్ చేసిన తురవాత పాన్ కార్డు రీ ప్రింట్ కోసం అవసరమైన కనీస రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాలి. పేమెంట్ పూర్తయ్యాక కొద్దిరోజుల్లో మీ ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది. 

పాన్ కార్డు రీ ప్రింట్‌కు రుసుము చాలా తక్కువే ఉంటుంది. మీరు ఇండియాలో ఉంటున్నారా లేక విదేశాల్లో ఉంటున్నారా అనే దానిపై ఆధారపడి ఫీజు మారుతుంది. ఇండియాలో అయితే కేవలం 50 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. అదే విదేశాల్లో ఉంటే మాత్రం 959 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

Also read: Aadhaar Card Validity: ఆధార్ కార్డుకు వ్యాలిడిటీ ఉంటుందా, ఎలా చెక్ చేసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News