Budget 2022: రేపటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ సారి కాస్త ప్రత్యేకం!

Budget Session 2022: కరోనా నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ సమావేశాలు కాస్త భిన్నంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 07:51 PM IST
  • బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దం
  • కఠిన కొవిడ్ నిబంధనల నడుమ సమావేశాలు
  • తొలి రోజు పార్లమెంట్​ ముందుకు ఆర్థిక సర్వే
Budget 2022: రేపటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ సారి కాస్త ప్రత్యేకం!

Budget Session 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (జనవరి 31) ప్రారభం కానున్నాయి. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ సమావేశాలు కాస్త ప్రత్యేకంగా జరగనున్నాయి.

సమావేశాల ప్రారభమయ్యాక తొలి రెండు రోజులు మినహా.. మిగతా రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో షిఫ్టుల వారీగా పని చేయనున్నాయి. మరోవైపు గత ఏడాదిలానే ఈ సారీ పేపర్​లెస్​ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.. మొదటి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు.. రెండో దశ మార్చి 14 నుంచి ఏప్రిల్​ 8 వరకు జరగనుంది.

మొదటి దశలో తొలి రోజు ఇలా..

తొలి రోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్ కోవిడ్​ ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్నారు.

ఏమిటి ఈ ఆర్థిక సర్వే?

గత ఏడాది బడ్జెట్​ సమయంలో పెట్టుకున్న లక్ష్యాలు, సాధించిన విజయాలతో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంచనాలతో కూడుకున్నదే ఆర్థిక సర్వే. ఈ సర్వేను ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అధ్యక్షతన ఆర్థిక నిపుణులతో కూడిన బృందం తయారు చేస్తుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాల్సిన విధానాలపై కూడా ఈ సర్వే ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. దేశ ప్రస్తుత ఆర్థిక స్థితిపై పూర్తి అవగాహన ఇచ్చే విధంగా ఈ సర్వే ఉపయోగపడుతుంది.

రెండో రోజు బడ్జెట్​..

రెండో రోజు (ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్ 2022పై ప్రసంగం చేయనున్నారు. ఈ ప్రసంగాం సహా బడ్జెట్​లో కేటాయింపులను సామాన్యులు సైతం తెలుసుకునే విధంగా 'యూనియన్ బడ్జెట్ యాప్​'ను ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.

ఉభయ సభల షిఫ్టులు ఇలా..

ఇక ఫిబ్రవరి రెండవ తేదీన నుంచి ఉభయ సభలు వేర్వేరు సమాల్లో భేటీ కానున్నాయి. ఒక్కో సభ రోజుకు 5 గంటల చొప్పున మాత్రమే పని చేయనుంది.

పార్లమెంట్​ సిబ్బంది పెద్ద ఎత్తున కరోనా బారిన పడటం, ప్రస్తుతం దేశంలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది పార్లమెంట్ వ్యవహారాల విభాగం.

మొదట షిఫ్టులో రాజ్య సభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భేటీ కానుంది.

ఆ తర్వాత రెండో షిఫ్టులో సాయంత్రం 4 గంటల నంచి రాత్రి 9 గంటల వరకు లోక్​ సభ సమావేశమవనుంది.

Also read: Budget 2022 Expectations: బడ్జెట్ 2022లో ఆ నిర్ణయం ఉంటే.. పెరగనున్న టెక్​ హోం శాలరీ!

Also read: Moto G60 for RS 149: కేవలం రూ.149లకే Moto G60 స్మార్ట్ ఫోన్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News