Petroleum Minister Hardeep Puri: పెట్రోల్, డీజిల్ ధరలు 8-10 రూపాయల వరకు తగ్గుతాయని ఇటీవల ప్రచారం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలు అన్ని ఫేక్ అని కొట్టేపాడేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్ర తగ్గించనుందని వార్తలు వైరల్ అయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు ప్రచారం పూర్తిగా ఊహజనితమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీ అన్నారు. ఇంధన ధరల తగ్గింపునకు సంబంధించి చమురు కంపెనీలతో ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు.
ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు దాదాపు $75 వద్ద ట్రేడవుతోంది. WTI క్రూడ్ కూడా బ్యారెల్‌కు $70 వద్ద ట్రేడవుతోంది. ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని వార్తలు వచ్చాయి. మూడు ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకం ద్వారా లాభాలను పొందుతున్నాయని.. ఆ లాభాలను వినియోదారులకు బదలీ చేయవచ్చని తెలిసింది. తద్వారా లీటరు పెట్రోల్‌పై రూ.10 వరకు, డీజిల్‌పై రూ.6 వరకు తగ్గించవచ్చని ప్రచారం జరిగింది. అయితే ప్రచారాన్ని పెట్రోలియం శాఖ మంత్రి పూర్తిగా కొట్టిపారేశారు.
ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీ తెలిపారు. వివిధ మార్గాల నుంచి చమురు సరఫరా జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అలాగే ఎర్ర సముద్రం నుంచి సరఫరా చేసే అంశాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒడుదొడుకుల కారణంగా అభివృద్ధి చెందిన, పొరుగు దేశాల్లో కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయన్నారు. అయితే మన దేశంలో మాత్రం స్థిరంగా ఉన్నాయన్నారు. దక్షిణాసియా దేశాల్లో కూడా చమురు ధరలు 40 నుంచి 80 శాతం వరకు పెరిగాయని.. పశ్చిమ దేశాల్లోనూ ధరలు పెరిగాయని గుర్తు చేశారు. మన దేశంలో 2021 నవంబర్, 2022 మే నెలలో రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటి ఆయన అన్నారు. ఇంధనం, చమురు, ఎల్‌పీజీ వినియోగంలో మన దేశం మూడో స్థానంలో ఉందన్నారు. ఎల్‌ఎన్‌జీ దిగుమతిదారు, రిఫైనర్, ఆటోమొబైల్ మార్కెట్‌లో భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించిందని.. అంటే ఇంధన అవసరాలు చాలా ఎక్కువ అని చెప్పారు. చమురు ధరల్లో భారీ అస్థిరత ఉన్నందున.. ఇంధనంపై ఎలాంటి ధరనైనా తగ్గించడం ప్రభుత్వానికి కష్టమన్నారు. ప్రస్తుతం ధరల తగ్గింపుపై చమురు కంపెనీలతో చర్చలు జరగడం లేదని కేంద్ర మంత్రి వివరించారు.
Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter