Post Office MIS Account: వేయి రూపాయలతో ఎక్కౌంట్ ఓపెన్ చేసి.. నెలకు 5 వేల రూపాయలు పొందండి

Post Office MIS Account: పోస్ట్ ఆఫీసు పథకాల గురించి తెలుసుకోవాలే కానీ..అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి. పోస్టాఫీసు మంత్రీ ఇన్‌కం స్కీమ్ నిజంగా ఓ మంచి పథకం. నెలకు 5 వేల రూపాయలు చేతికందే స్కీమ్ ఇది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 29, 2022, 12:51 PM IST
Post Office MIS Account: వేయి రూపాయలతో ఎక్కౌంట్ ఓపెన్ చేసి.. నెలకు 5 వేల రూపాయలు పొందండి

Post Office MIS Account: పోస్ట్ ఆఫీసు పథకాల గురించి తెలుసుకోవాలే కానీ..అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి. పోస్టాఫీసు మంత్రీ ఇన్‌కం స్కీమ్ నిజంగా ఓ మంచి పథకం. నెలకు 5 వేల రూపాయలు చేతికందే స్కీమ్ ఇది. ఆ వివరాలు మీ కోసం..

మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా పథకాలున్నాయి. కానీ ఏ పథకమైనా రిస్క్ ఉంటుంది. మీరు కూడా పెట్టుబడులు పెట్టేందుకు మంచి స్కీమ్ కోసం ఆలోచిస్తుంటే..పోస్టాఫీసులో అద్భుతమైన గ్యారంటీ రిటర్న్ స్కీమ్ ఉంది. అదే పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్. ఇందులో ఒకసారే డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఈ ఎక్కౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లుంటుంది. అంటే ఐదేళ్ల తరువాత నుంచి గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కం స్కీమ్. ఈ స్కీమ్ వివరాలు ఇలా ఉన్నాయి..

పోస్టాఫీసు స్కీమ్‌లో సింగిల్, జాయింట్ రెండు ఎక్కౌంట్లు ఓపెన్ చేయవచ్చు. కనీసం వేయి రూపాయల్నించి ఎక్కౌంట్ తెరిచే వెసులుబాటు ఉంది. సింగిల్ ఎక్కౌంట్‌లో అత్యధికంగా 4.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. అటు జాయింట్ ఖాతాలో అయితే 9 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్‌లో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి కూడా జాయింట్ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ ఎక్కౌంట్ ద్వారా లభించే ఆదాయాన్ని ఇద్దరికీ సమానంగా ఇస్తారు. జాయింట్ ఎక్కౌంట్‌ను ఎప్పుడైనా సరే సింగిల్ ఎక్కౌంట్‌లో మార్చవచ్చు. ఎక్కౌంట్‌లో ఏ విధమైన మార్పులు చేయాలన్నా..ఇద్దరూ కలిసి నివేదించాలి. మెచ్యూరిటీ ఐదేళ్ల తరువాత మరో 5-5 ఏళ్లకు పెంచవచ్చు. ఎక్కౌంట్‌లో నామినేషన్ సౌకర్యం కూడా ఉంది. ఈ స్కీమ్‌లో డబ్బులు పూర్తిగా సురక్షితం. ప్రభుత్వ గ్యారంటీ స్కీమ్ ఇది. 

ఇండియా పోస్ట్ అందిస్తున్న సమాచారం ప్రకారం మంత్లీ ఇన్‌కం స్కీమ్‌పై ఏడాదికి 6.6 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతినెలా ఈ వడ్డీ ఉంటుంది. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్‌లో ఎవరైనా సరే పెట్టుబడి పెట్టవచ్చు.

ముందుగా క్లోజ్ చేయాలంటే ఎలా

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్ మెచ్యూరిటీ ఐదేళ్లకు ఉంటుంది. ఇందులో ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇందులో డిపాజిట్ తేదీకు ఏడాది తరవాతే డబ్బులు తీసేందుకు అవకాశముంది. ఈ స్కీమ్ నియమాల ప్రకారం ఒకవేళ ఏడాది నుంచి మూడేళ్లలోగా డబ్బులు తీయాలనుకుంటే..డిపాజిట్ నగదులో 2 శాతం తగ్గించి ఇస్తారు. ఒకవేళ ఎక్కౌంట్ ఓపెన్ చేసిన 3 ఏళ్ల తరువాత మెచ్యూరిటీ కంటే ముందు ఎప్పుడైనా డబ్బులు వాపసు తీసుకుంటే 1 శాతం తగ్గించి ఇస్తారు.

ఎక్కౌంట్ ఎలా ఓపెన్ చేయాలి

మంత్లీ ఇన్‌కం స్కీమ్ ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు ముందుగా పోస్టాఫీసులో సేవింగ్స్ ఎక్కౌంట్ ఓపెన్ చేయాలి. దీనికోసం ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు లేదా పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడీ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరమౌతాయి. దీనితోపాటు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. అడ్రెస్ ప్రూఫ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డు అవసరమౌతుంది. అవసరమైన డాక్యుమెంట్లుతో పోస్టాఫీసులో మంత్లీ ఇన్‌కం స్కీమ్ దరఖాస్తు సమర్పించాలి. ఆన్‌లైన్‌లో కూడా ఈ దరఖాస్తు లభిస్తుంది. నామినీ ఎవరనేది ప్రస్తావించాలి. ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు ముందుగా వేయి రూపాయల నగదు లేదా చెక్ ఇవ్వాలి. 

Also read: Amazon Offers: శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈపై బంపర్ ఆఫర్.. ఏకంగా 35 వేల తగ్గింపు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News