Post office Saving Scheme: ఈ పోస్ట్ ఆఫీసు సేవింగ్ పథకాలతో పాత ట్యాక్స్ విధానంలో ప్రయోజనాలు పొందండి ఇలా

Post office Saving Scheme: ప్రస్తుతం ఉద్యోగవర్గాల్లో  ట్యాక్స్ రెజీమ్ ప్రస్తావన నడుస్తోంది. పాత ట్యాక్స్ విధానం లేదా కొత్త ట్యాక్స్ విధానం రెండింటిలో ఏది ఎంచుకుంటారనే చర్చ సాగుతోంది. అటు కంపెనీలు కూడా ఉద్యోగుల్ని ఇదే అడుగుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2023, 01:10 PM IST
Post office Saving Scheme: ఈ పోస్ట్ ఆఫీసు సేవింగ్ పథకాలతో పాత ట్యాక్స్ విధానంలో ప్రయోజనాలు పొందండి ఇలా

Post office Saving Scheme: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు రకాల ట్యాక్స్ విధానాల ఆప్షన్ ఉంచింది. ఒకటి పాత ట్యాక్స్ విధానమైతే రెండవది కొత్త ట్యాక్స్ విధానం. కంపెనీలు సైతం ఉద్యోగులు ఏ ట్యాక్స్ విధానాన్ని ఎంచుకుంటారనే ఆప్షన్ అడుగుతోంది. మరోవైపు ఇన్‌కంటాక్స్ డిక్లరేషన్ వివరాలు సమర్పించాలని కోరుతున్నాయి. 

ట్యాక్స్ విధానం ఏది ఎంచుకోవాలనే చర్చ నేపధ్యంలో ఉద్యోగులు ఇప్పటికీ పాత ట్యాక్స్ విధానంలో ఉంటే పోస్టాఫీసు నుంచి కొన్ని సేవింగ్స్ పథకాలున్నాయి. వీటి ద్వారా సెక్షన్ 80 సి కింద ట్యాక్స్ ప్రయోజనాలు పొందవచ్చు. ఏ విధమైన రుణాలు, పెట్టుబడులు లేనివారు మరో ఆలోచన లేకుండా కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకోనున్నారు. అంటే హోమ్ లోన్, మెడికల్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ ఫీజు, సేవింగ్స్ పధకాలు వంటివి లేనప్పుడు కొత్త ట్యాక్స్ విధానమే సరైన ప్రత్యామ్నాయం. అదే పాత ట్యాక్స్ విధానంలో ఉన్నవాళ్లు ఈ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే ట్యాక్స్ భారీగా కట్ అవుతుంది. పాత ట్యాక్స్ విధానం ఎంచుకునేవారికి సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపునిచ్చే పోస్టాఫీసు పధకాన్ని ప్రారంభించింది. సెక్షన్ 80 సి ప్రకారం ఈ మినహాయింపు వర్తిస్తుంది.

పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్

ఇదొక దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. సెక్షన్ 80 సి కింద ప్రయోజనముంటుంది. ఈ పథకంలో పెట్టుబడి వ్యవధి 15 ఏళ్లుంటుంది. ఇందులో ఇన్వెస్టర్లకు నిర్ణీత మొత్తంలో వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి గరిష్టంగా 1.5 లక్షల వరకూ ఉంటుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది నిశ్చిత ఆదాయం కలిగిన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఈ పథకం మెచ్యూరిటీ 5 ఏళ్లు. ప్రతి యేటా 1.5 లక్షల రూపాయల వరకూ డిడక్షన్ ఉంటుంది. సెక్షన్ 80 సి ప్రకారం మినహాయింపు లభిస్తుంది. దీనిపై ఏ విధమైన టీడీఎస్ ఉండదు.

సుకన్య సమృద్ధి యోజన

ఈ పథకంలో సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. ఈ పధకాన్ని కేవలం అమ్మాయిల పేరుతో ప్రారంభించాల్సి ఉంటుంది. పదేళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన అమ్మాయిలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పధకం మెచ్యూరిచీ 21 ఏళ్లు. ఇందులో ఇన్వెస్టర్‌కు నిర్ణీత మొత్తంలో వడ్డీ లభిస్తుంటుంది. ఇందులో గరిష్టంగా 1.5 లక్షలు ఏడాదికి ఇవ్వెస్ట్ చేయవచ్చు.

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది. ఇన్వెస్ట్ చేశాక నిర్ణీత మొత్తంలో వడ్డీ లభిస్తుంటుంది. ఈ పథకం కాల పరిమితి 1, 2,3 ఏళ్లకు ఉంటుంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే సేవింగ్స్ పధకం. ఇందులో 5 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది. సెక్షన్ 80సి ప్రకారం ఏడాదికి 1.50 లక్షల వరకూ ట్యాక్స్ డిడక్షన్ వర్తిస్తుంది. టీడీఎస్ ఉండదు. ఇందులో ఏ ఒక్క పధకంలో పెట్టుబడి పెట్టినా మీ ట్యాక్స్ డిడక్షన్ తగ్గిపోతుంది. అయితే సీనియర్ సిటిజన్లకు వర్తించే నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.సెక్షన్ 80 ప్రకారం ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది.

Also read: Samsung new launch: అద్భుతమైన బ్యాటరీ, ఫీచర్లతో తక్కువ ధరకే Samsung Galaxy M14 5G ఇండియాలో లాంచ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News