Bank Holidays: సెప్టెంబర్ నెలలో మీకేమైనా బ్యాంకు పనులుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఏకంగా 13 రోజులు బ్యాంకు సెలవులున్నాయి. సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవులు ఎప్పుడనేది చూద్దాం..
నిత్యం బ్యాంకు సంబంధిత పనులుండేవాళ్లు..ఎప్పటికప్పుడు బ్యాంకు సెలవులు ఎప్పుడనేది పరిశీలిస్తుండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఆగస్టు నెల దాదాపుగా పూర్తి కావచ్చింది. సెప్టెంబర్ నెల ప్రారంభం కానున్న నేపధ్యంలో ఆ నెల బ్యాంకు సెలవుల పరిస్థితి ఏంటనేది తెలుసుకుందాం. సెప్టెంబర్‌లో చాలా రోజులు బ్యాంకు సెలవులున్నాయి. రిజర్వ్ బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం సెప్టంబర్ నెలలో సెలవులు ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో మొత్తం 8 సెలవులున్నాయి. ఇవికాకుండా శని, ఆదివారాల సెలవులు 6 ఉన్నాయి. అంటే మొత్తం 14 రోజులు బ్యాంకులు మూసేసి ఉంటాయి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఈ సెలవులు వేర్వేరుగా ఉంటాయి. ఈ నెల ప్రారంభం సెప్టెంబర్ 1న గోవాలో వినాయక చవితి సెలవుంది. ఇక సెప్టెంబర్ 6వ తేదీన జార్ఘండ్‌లో కర్మ పూజ పేరుతో బ్యాంకు సెలవుంటుంది. సెప్టెంబర్ 7,8 తేదీల్లో కేరళలో ఓనం పండుగ సెలవులున్నాయి. సెప్టెంబర్ 9వ తేదీ సిక్కిం, గ్యాంగ్‌టక్‌లో ఇంద్రజాత సెలవుంది. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 10వ తేదీన శ్రీ నరవణ గురు జయంతి సందర్బంగా కేరళలో బ్యాంకు హాలిడే ఉంటుంది.
సెప్టెంబర్ 21న శ్రీ నారాయణ గురు సమాధి దినం కారణంగా కేరళలో బ్యాంకులకు సెలవుంటుంది. సెప్టెంబర్ 26వ తేదీనన నవరాత్రి స్థాపనైనందున రాజస్థాన్, మణిపాల్‌లో బాంకులకు సెలవుంది. ఇక సెప్టెంబర్ 24వ తేదీన నాలుగవ శనివారమైనందున బ్యాంకులు సెలవుంటాయి.
సెప్టెంబర్ నెలలో సెలవుల జాబితా
సెప్టెంబర్ 1 వినాయక చవితి రెండవ రోజు
సెప్టెంబర్ 4 ఆదివారం
సెప్టెంబర్ 6 కర్మపూజ
సెప్టెంబర్ 7, 8 ఓనం
సెప్టెంబర్ 9 ఇంద్రజాత
సెప్టెంబర్ 10 శ్రీ నరవణ గురు జయంతి, రెండవ శనివారం
సెప్టెంబర్ 11 ఆదివారం
సెప్టెంబర్ 18 ఆదివారం
సెప్టెంబర్ 21 శ్రీ నారాయణ గురు సమాధి
సెప్టెంబర్ 24 నాలుగవ శనివారం
సెప్టెంబర్ 25 ఆదివారం
సెప్టెంబర్ 26 ఆదివారం
Also read: Gold Price Today 23 August: మగువలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook