Reliance Industries: ప్రముఖ అమెరికన్ కంపెనీని రిలయన్స్ చేతికి చేజిక్కించుకుంది. ఫలితంగా ఎనర్జీ రంగంలో రిలయన్స్ మరింత బలోపేతమైంది. ఆ వివరాలు మీ కోసం.
అమెరికా కాలిఫోర్నియాలో ఉన్న ప్రముఖ పవర్ కంపెనీ Senshawkలో 3.2 కోట్ల డాలర్లు అంటే 256 కోట్ల రూపాయల పెట్టబడితో 79.4 శాతం వాటాను చేజిక్కించుకుంది. రిలయన్స్ అధికారికంగా ఈ ప్రకటన చేసింది. ఈ టేకోవర్‌తో సౌర విద్యుత్ క్షేత్రంలో రిలయన్స్ మరింత పటిష్టమైందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. 2018లో స్థాపించిన సెన్స్‌హాక్ కంపెనీ సౌర విద్యుత్ పరికరాలకు ప్రసిద్ధి చెందింది. గత ఏడాది 2021-22 లో కంపెనీ 23 లక్షల డాలర్ల వ్యాపారం నమోదు చేసింది.
సెన్స్‌హాక్ కంపెనీలో మేజర్ వాటా చేజిక్కించుకునేందుకు 3.2 కోట్ల డాలర్లను వెచ్చించింది. ఇందులో భవిష్యత్ అభివృద్ధికి డబ్బులు, ఉత్పత్తులు అందుబాటులో ఉండటం వంటివి ఉన్నాయి. తమ కంపెనీ గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చేందుకు అంకితమైన ఉందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. 2030 వరకూ 100 గెగావాట్స్ సౌర విద్యుత్ ఉత్పత్తిలో దోహదపడనుంది. సెన్స్‌హాక్ కంపెనీ ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి, సౌర ఉపకరణాల అభివృద్ధికి పనిచేస్తామని తెలిపారు.
ఈ ఏడాది చివరిలోగా టేకోవర్ ప్రక్రియ పూర్తి కానుందని ముకేశ్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. సెన్స్‌హాక్ కంపెనీ 15 దేశాల్లో విస్తరించిన 140 కంటే ఎక్కువ కస్టమర్లకు దాదాపు 600 సైట్స్‌పై వందకుపైగా గెగావాట్స్‌కు తుది పరిష్కారం ఇస్తుందన్నారు.
Also read: Gold Price Today 6 September: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook