Jio Recharge Plans: రిలయన్స్ జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్. జియో కొత్తగా రెండు చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ రెండు ప్లాన్స్‌తో అదనపు వ్యాలిడిటీ లభించనుంది. ఏకంగా 90 రోజులు, 98 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ రెండు ప్లాన్స్‌తో ఇంకా ఇతర లాభాలు కూడా ఉన్నాయి.
దేశంలోని అతిపెద్ద టెలీకం కంపెనీ రిలయన్స్ జియో రెండు చౌక ప్లాన్స్ ప్రవేశపెట్టింది. దీపావళి ఆఫర్ కింద ఫ్రీ రీఛార్జ్, ఉచిత డేటా అందించింది. ఈ రెండు ప్లాన్స్‌తో యూజర్లకు 90 రోజులు, 98 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్స్‌కు రోజుకు 10 రూపాయలు ఖర్చవుతుందంతే. కానీ అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలు మాత్రం ఉండనే ఉన్నాయి. రిలయన్స్ జియో అందిస్తున్న ఈ రెండు రీఛార్జ్ ప్లాన్స్ టారిఫ్ 899 రూపాయలు, 999 రూపాయలుగా ఉంది. 899 రూపాయల ప్లాన్‌లో యూజర్లకు 90 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక 999 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌లో 98 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
899 రూపాయల రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్‌లో రిలయన్స్ జియో 20 జీబీ అదనపు డేటా లభిస్తుంది. 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇది కాకుండా రోజుకు 2 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. నేషనల్ రోమింగ్ ఉచితంగా అందుతుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపించవచ్చు.
999 రూపాయల రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్‌లో 98 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో కూడా రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా ఉచితంగా లభిస్తాయి. రిలయన్స్ జియో, వోడాపోన్ ఐడియా, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ టెలీకం కంపెనీలు జూలై నుంచి టారిఫ్ రేట్లు భారీగా పెంచడంతో చాలామంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌కు మరలిపోయారు. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ అందించే టారిఫ్ ప్లాన్స్‌తో ప్రైవేట్ టెలీకం కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో జియో ఏకంగా 40 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
Also read: NEET Exam Pattern: నీట్ పరీక్ష విధానంలో మార్పు, ఇకపై జేఈఈ తరహాలో రెండంచెల్లో పరీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.