JioBook Loptop: రిలయన్స్ జియో నుంచి మరో సెన్సేషన్, అతి తక్కువ ధరకే జియో బుక్

JioBook Loptop: కర్లో దునియా ముఠ్టీమే అంటూ సెల్ ఫోన్‌తో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మొత్తం మార్కెట్ శాసిస్తోంది రిలయన్స్. ఆతరువాత రిలయన్స్ జియో ఓ సంచలనం. ఆల్ ఫ్రీ అంటా మార్కెట్‌లో స్థిరపడిపోయింది. ఇప్పుడు మరో సంచలనాన్ని రేపుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2023, 10:49 PM IST
JioBook Loptop: రిలయన్స్ జియో నుంచి మరో సెన్సేషన్, అతి తక్కువ ధరకే జియో బుక్

JioBook Loptop: రిలయన్స్ జియో టెలీకం మార్కెట్‌లో అగ్రభాగం ఆక్రమించేసింది. సరికొత్త ప్లాన్స్, ఛీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్‌తో హల్ చల్ చేసింది. ఇప్పుడు ఆ రంగంలో కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది. అత్యంత తక్కువ ధరతో విద్యార్ధుల్ని టార్గెట్ చేసింది. 

టెలీకం తరువాత ఫైబర్. ఈ రెండు రంగాల్లో సత్తా చాటి తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్న రిలయన్స్ జియో ఇప్పుడు జియో బుక్ పేరుతో ల్యాప్‌టాప్ మార్కెట్ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది. జియో బుక్ పేరుతో స్లిమ్, ఛీప్ అండ్ బెస్ట్ ల్యాప్‌టాప్ ప్రవేశపెట్టింది. ఈ జియో బుక్‌లో 4G LTE, WiFiతో పాటు Bluetooth 5.0,HDMI పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ , సిమ్ సపోర్ట్ ఉన్నాయి. జియో బుక్ మీడియాటెక్ ఎంటీ 8788 ఆక్టోకోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4GB LPDDR4 ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. 256 జీబీ వరకూ పెంచుకోవచ్చు.

ఇక జియో బుక్ ఇతర ఫీచర్ల గురించి పరిశీలిస్తే అద్భుతమైన 8 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.  ఇదికాకుండా యాంటీ గ్లేర్ హెచ్‌డి డిస్‌ప్లే, స్టీరియో స్పీకర్లు ఉంటాయి. కీబోర్డ్‌తో పాటు టచ్ ప్యాడ్ కూడా ఉంటుంది. 4జీ కనెక్టివిటీపై పనిచేస్తుంది. అయితే జియో బుక్‌లో కేవలం జియో సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు, ఫీచర్లు ఉన్న జియో బుక్ ధర ఎంతో తెలుసా. చాలా చౌక ధరకు అందిస్తోంది రిలయన్స్ జియో. ఈ జియో బుక్ ధర కేవలం 16,499 రూపాయలు మాత్రమే. ఇదే జియో బుక్‌ను అమెజాన్ వేదికపై హెచ్‌డీఎఫ్‌సి కార్డుపై కొనుగోలు చేస్తే 1250 రూపాయలు అదనంగా తగ్గుతుంది. అంటే 15,249 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. 

కేవలం ఆన్‌లైన్‌లోనే కాకుండా రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి కూడా జియో బుక్ కొనుగోలు చేయవచ్చు. జియో బుక్ చూడ్డానికి కూడా స్లిమ్ అండ్ స్టైలిష్‌గా ఉంటుంది. విద్యార్ధుల్ని టార్గెట్ చేసి జియో బుక్ లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. 

Also read: Best Selling 7 Seater: మారుతి ఎర్టిగాను తలదన్నిన మరో 7 సీటర్, ధర కేవలం 6.5 లక్షలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News