Reliance Jio Laptop: రూ.15 వేలకు రిలయన్స్ జియో ల్యాప్‌టాప్.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే..!

Jio Laptop Price and Features: రిలయన్స్ జియో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌ను తీసుకురానుంది. రూ.15 వేలకు అత్యాధునిక ఫీచర్లతో రూపొందించే ప్లాన్‌లో ఉంది. ఇప్పటికే పలు ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలతో చర్చలు జరిపింది. వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2023, 06:33 PM IST
Reliance Jio Laptop: రూ.15 వేలకు రిలయన్స్ జియో ల్యాప్‌టాప్.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే..!

Jio Laptop Price and Features: తక్కువ ధరకే మొబైల్స్, ఇంటర్‌నెట్‌ను అందించి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ. తాజాగా ల్యాప్‌టాప్‌ను కూడా అతి తక్కువ ధరకే తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రూ.15 వేలకే ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే HP, Acer, Lenovo తదితర వంటి ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలతో చర్చలు జరిపారు. ఈ ల్యాప్‌టాప్‌ను క్లౌడ్ ద్వారా అందించే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో పరికరాన్ని లాంచ్ చేయడానికి రిలయాన్స్ జియో సన్నాహాలు ప్రారంభించింది. 

అంటే రిలయన్స్ జియో అందించే క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అయిన జియో క్లౌడ్‌లో ల్యాప్‌టాప్ ప్రాసెసింగ్, స్టోరేజ్ జరుగుతుంది. ఇది వినియోగదారులు తక్కువ ధరలో కంప్యూటింగ్‌ని పొందేందుకు యాక్సెస్‌ను పొందేందుకు వీలు కల్పిస్తుంది. మొదటిసారి ల్యాప్‌టాప్ కొనుగోలుదారులు.. తమ విద్యా సంస్థలను చేరుకోవడానికి మార్గం సుగమం చేయనుంది. జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో అందుబాటులోకి రానుంది. ఒకే ల్యాప్‌టాప్‌తో వివిధ రకాల సబ్‌స్క్రిప్షన్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే HP Chromebookలో దీని కోసం ట్రయల్‌లను నిర్వహించింది. 

కొత్త ల్యాప్‌టాప్‌లకు సంబంధించి రిలయన్స్ జియో ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. అయితే JioBook లాంచ్‌తో సెగ్మెంట్‌ను చేపట్టాలనే ఉద్దేశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. 16,499 ధరతో రిలయన్స్ జియో బుక్ JioOSను బాక్స్ వెలుపల నడుపుతోంది. అంటే 4 జీబీ RAM, 64 జీబీ స్టోరేజ్‌తో యాడ్ చేసిన MediaTek చిప్‌సెట్‌ ఆధారంగా పనిచేస్తుంది. మీకు అవసరం అనుకుంటే ఎక్స్‌డేండ్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌తో పాటు కొనుగోలుదారులకు 100GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. JioBook 11.6-అంగుళాల HD డిస్ ప్లేను ఉంటుంది. కేవలం 990 గ్రాముల బరువున్న జియోబుక్ గ్రే, బ్లూ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంట

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News