Royal Enfield New Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్తగా 650 సిసి బైక్స్, 3 బైక్స్ లాంచ్‌కు సిద్ధం

Royal Enfield New Bikes: దేశంలోని ద్విచక్ర వాహనాల్లో స్టైల్ అండ్ క్రేజీ బైక్ అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ అనే చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కు వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటోంది. ఇప్పుడు కొత్తగా మరో మూడు బైక్స్ లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2024, 02:03 PM IST
Royal Enfield New Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్తగా 650 సిసి బైక్స్, 3 బైక్స్ లాంచ్‌కు సిద్ధం

Royal Enfield New Bikes: దేశంలోని 350 సిసి బైక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రముఖమైంది. యువత మాత్రమే కాదు అందరూ చాలా ఇష్టంగా వాడే బైక్ ఇది. ఇప్పుడు కొత్తగా 350 సిసి, 450 సిసి, 650 సిసి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ త్వరలో లాంచ్ కానున్నాయి. కొండ ప్రాంతాల్లో తిరిగేందుకు ఇవి అత్యంత అనువుగా ఉంటాయి. ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అత్యంత ఆదరణ పొందిన బైక్‌గా ఉంది. అత్యధికంగా విక్రయమయ్యేది కూడా ఇదే. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ లేదా బుల్లెట్ అభిమానుల కోసం కొత్తగా మూడు సెగ్మెంట్లలో బైక్స్ ప్రవేశపెట్టనుంది. ఇవి 350 సిసి, 450 సిసి, 650 సిసిల్లో రానున్నాయి. ఈ ఏడాది ఆఖరుకు మార్కెట్‌లో ఎంట్రీ కావచ్చని అంచనా. రాయల్ ఎన్‌ఫీల్డ్ గొరిల్లా 450. ఇది త్వరలో మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. Royal Enfield Guerilla 450 ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ కావచ్చు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Triumph Speed 400 పోటీగా రానున్న ఈ బైక్‌లో 17 ఇంచెస్ ఎల్లాయ్ వీల్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 కూడా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వచ్చు. ఇది 650 సిసితో పనిచేస్తుంది. Royal Enfield Bullet 350కు విశేష ఆదరణ లభించడంలో కంపెనీ ఇందులోనే 650 సిసి వెర్షన్ లాంచ్ చేస్తోంది. ఇందులో ట్విన్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. ఇది 47 బీహెచ్‌పి పవర్, 52 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ కూడా ట్విన్ ఇంజన్ సపోర్ట్‌తో వస్తోంది. ఇది కూడా 47 బీహెచ్‌పి పవర్, 52 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Interceptor 650,Super Meteor 650లకు పోటీ ఇవ్వచ్చు. మొత్తానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఈ ఏడాది చివర్లో లేదా 2025 ప్రారంభంలో ఈ మూడు బైక్స్ లాంచ్ కావచ్చు. 

Also read: PF Account: పీఎఫ్ ఎక్కౌంట్‌తో మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలి, అవసరమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News