SBI: ఎస్​బీఐ రుణాలు మరింత భారం- బేస్​ రేటు 10 బేసిస్​ పాయింట్లు పెంపు!

SBI: ఎస్​బీఐలో రుణాలు మరింత భారం కానున్నాయి. బేస్​ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఎస్​బీఐ నిర్ణయం తీసుకుంది. బేస్​ రేటుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 03:43 PM IST
  • రుణ గ్రహీతలకు ఎస్​బీఐ షాక్​
  • బేస్​ రేటు 10 బేసిస్​ పాయింట్లు పెంపు
  • పెరిగిన వడ్డీ రేటు ఈ నెల 15 నుంచే వర్తింపు
SBI: ఎస్​బీఐ రుణాలు మరింత భారం- బేస్​ రేటు 10 బేసిస్​ పాయింట్లు పెంపు!

SBI: దేశీయ అతి పెద్ద బ్యాంక్​ ఎస్​బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బేస్​ రేటును పెంచుతున్నట్లు (SBI Base rate hike) తాజాగా ప్రకటించింది. బేస్​ రేటు 0.10 శాతం (10 బేసిస్​ పాయింట్లు) పెంచుతున్నట్లు తెలిపింది. దీనితో కనీస వడ్డీ రేటు 7.55 శాతానికి (SBI Base rate now) పెరిగింది. దీనితో పాటు ప్రైమ్ లెంటింగ్ రేటు 12.30 శాతానికి చేరింది. పెరిగిన బేస్​ రేట్​ డిసెంబర్ 15 నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది.

మార్జినల్​ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్​ఆర్​)లో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది ఎస్​బీఐ.

ఏమిటి ఈ బేస్​ రేటు?

బ్యాంకులు ఇచ్చే రుణాలకు ఆర్​బీఐ బేస్​ రేటును (What is Base rate) నిర్ణయిస్తుంది. పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు ఈ బేస్ రేటులో మార్పు చేస్తుంది. ఈ రేటు కన్నా తక్కువకు రుణాలు ఇచ్చేఅనుమతి బ్యాంకులకు ఉండదు.

రుణ గ్రహీతలపై ప్రభావం..

బేస్​ రేటు పెరిగిన కారణంగా ఆ ప్రభావం బ్యాంకింగ్ వినియోగదారులపై.. ముఖ్యంగా రుణ గ్రహీతలపై అధికంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే.. తక్కువ వడ్డీకి రుణాలు చేయాలనుకున్నా.. ఆర్​బీఐ పరిమితులకు లోబడి మాత్రమే బ్యాంకులు వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఎంసీఎల్​ఆర్​ అంటే?

బేస్​ రేటు ఆధారంగానే కాకుండా బ్యాంకులు రుణాలకు వడ్డీ నిర్ణయించేందుకు మార్జినల్​ కాస్ట్ ఫండ్స్ బేస్​డ్​ లెండింగ్ రేట్​ (ఎంసీఎల్​ఆర్​)ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఎంసీఎల్​ఆర్​ ఆధారంగా నిర్ణయించే వడ్డీ రేటుకు రుణాలు తీసుకోవడం ద్వారా.. ఆర్​బీఐ రెపో రేటులో చేసే మార్పులకు తగ్గట్లుగా.. రిటైల్ రుణాగ్రహితల వడ్డీలోను మార్పు ఉంటుంది.

సాధారణంగా ప్రతి రెండు నెలలకు ఓ సారి రెపో, రివర్స్ రెపో రేట్లను సవరిస్తుంది ఆర్​బీఐ.

Also read: Gold Price today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు, వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు

Also read: Budget smartphones: రూ.10 వేలలోపే అదిరే స్మార్ట్​ఫోన్లు- ఫీచర్లు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News