Stock Market today: స్టాక్ మార్కరెట్లు మరోసారి భారీ నష్టాలను చవి చూశాయి. సోమవారం సెషన్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 1,024 పాయింట్లు కోల్పోయి 57,621 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ భారీగా 321 పాయింట్ల నష్టంతో 17,194 వద్ద స్థిరపడింది.
నష్టాలకు కారణాలు..
ఏడాదిన్నరకు పైగా స్థిరంగా ఉంటూ వస్తున్న రెపో రేట్లను రిజర్వు బ్యాంక్ పెంచొచ్చన్న అంచనాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనితో మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం నేడు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి కారణంగా ఆమె గౌరవార్థం నేడు సెలవు ప్రకటించారు. రేపటి నుంచి సమావేశం కానుంది ఎంపీసీ. 10వ తేదీని కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో సెన్సెక్స్ 58,707 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. ఒకానొక దశలో 57,299 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ ఇంట్రాడేలో 17,536 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,119 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 5 కంపెనీలు మాత్రమే లాభాలను గడించాయి. 25 సంస్థలు నష్టపోయాయి.
పవర్ గ్రిడ్ 1.91 శాతం, టాటా స్టీల్ 0.75 శాతం, ఎస్బీఐ 0.59 శాతం, ఎన్టీపీసీ 0.56 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.32 శాతం లాభాలను నమోదు చేశాయి.
ఎల్ అండ్ టీ 3.57 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.45 శాతం, బజాజ్ ఫినాన్స్ 3.24 శాతం, హెచ్డీఎఫ్సీ 3.11 శాతం, బాజ్ ఫిన్సర్వ్ 2.94 శాతం నష్టపోయాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), థైవాన్, హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను గడించాయి. టోక్యో (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు నష్టపోయాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.74.69 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
Also read: Tata Motors offers: టాటా కార్లపై రూ.60 వేల వరకు డిస్కౌంట్లు- ఆఫర్ పూర్తి వివరాలివే..
Also read: JioBook Laptop Features: త్వరలోనే మార్కెట్లోకి JioBook ల్యాప్ టాప్స్.. వాటి ఫీచర్లు ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook