వివిధ ఐటీ కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా విప్రో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఈసారి విప్రో అద్భుతమైన వృద్ది నమోదు చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో 2.8 శాతం పెరిగి 3053 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇది 2969 కోట్ల రూపాయలుంది.
విప్రో 2022-23 సంవత్సరం త్రైమాసికంలో ఆదాయం 23, 229 కోట్ల రూపాయలుంది. ప్రతి ఏటా ఆదాయంతో పోలిస్తే ఇది 14.3 శాతం అధికం. దాంతోపాటు కంపెనీ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఐటీ వ్యాపారంలో ఆదాయం వృద్ధి 11.5-12 శాతం ఉంటుందని తెలిపింది. మార్చ్ 31, 2023 క్లోజింగ్ త్రైమాసికం సమయానికి స్థిరంగా ఉండవచ్చని అంచనా వేస్తోంది.
వ్యాపారాల మొత్తం బుకింగ్ విప్రో వద్ద 4.3 బిలియన్ డాలర్లుందని కంపెనీ సీఈవో తెలిపారు. ఇందులో ఒక కోటి బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెద్ద కాంట్రాక్టులని చెప్పారు. కంపెనీ కస్టమర్ సంబంధాల్ని మెరుగుపర్చుకునేందుకు క్రమం తప్పకుండా మార్కెట్లో వాటా పెంచుకుంటోందన్నారు.
షేర్ మార్కెట్
కస్టమర్ల అవసరాల్ని తీర్చే సామర్ధ్యం కలిగి ఉండటం మార్కెట్లో విప్రో పటిష్టతకు కారణంగా నిలుస్తోందని కంపెనీ తెలిపింది. దాంతోపాటు విప్రో షేర్ హోల్డర్లకు డివిడెండ్ కూడా ప్రకటించింది. విప్రో ప్రతి ఈక్విటీ షేర్‌పై అదనపు లాభం ప్రకటించింది. ఇటీవల గత కొద్దికాలంగా ఐటీ కంపెనీలు నష్టాల్లో ఉన్న తరుణంలో విప్రో లాభాలు ఆర్జించడం విశేషం. ఇన్ ఫోసిస్, టీసీఎస్, విప్రో దాదాపు అన్ని కంపెనీలు 2022 ఆర్ధిక సంవత్సరంలో నష్టాలే నమోదు చేయడంతో షేర్ విలువ కూడా గణనీయంగా పడిపోయింది. ఈ క్రమంగా డిసెంబర్ త్రైమాసికానికి విప్రో తిరిగి లాభాల్లో రావడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook