Gold Rate Today In India: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో పతనమైన బంగారం ధరలు (Gold Price Today In Hyderabad) తాజాగా పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు సైతం స్థిరంగా పెరుగుతున్నాయి. పలు అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.

Updated: Oct 20, 2020, 06:22 AM IST
Gold Rate Today In India: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ పుంజుకుంటున్నాయి. అదే సమయంలో వెండి ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.670 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,730కు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.280 పెరగడంతో ధర రూ.47,090గా మార్కెట్ అవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా మూడోరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధరలలో ఏ మార్పు లేదు. రెండు రోజులనుంచి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,780 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,300గా ఉంది.

 

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో తగ్గుతూ వచ్చిన వెండి ధరలు (Silver Rate in India) తాజాగా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా వెండి ధర రూ.1,050 మేర భారీగా పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.62,750వద్ద మార్కె్ట్ అవుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర ఉంటుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe