ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CPGET-2020) దరఖాస్తు గడువును పొడిగించారు. దరఖాస్తు చేసుకోలేదని ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఇది శుభవార్త. సీపీజీఈటీ 2020 దరఖాస్తుల తుది గడువు (CPGET 2020 Application Last Date)ను అక్టోబర్ 23 వరకు పొడిగించారు. తెలంగాణలోని 6 యూనివర్సిటీలతో పాటు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH)లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. తెలంగాణ, పాలమూరు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీలలో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్, పీజీ డిప్లోమా, 5ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు, జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశాలకు సీపీజీఈటీ 2020 ప్రవేశ పరీక్ష ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ఫీజు చెల్లించడానికి క్లిక్ చేయండి : FEE PAYMENT FOR CPGET - 2020
అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి: CPGET 2020 Application Form
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe