Toyota Innova Crysta Diesel Bookings: ఇన్నోవా క్రిస్టా డీజిల్ వెర్షన్ మళ్లీ వచ్చేస్తోంది.. ప్రారంభమైన బుకింగ్స్!

Toyota Innova Crysta Diesel Bookings Open Now. టయోటా తన ప్రసిద్ధ ఎంపీవి ఇన్నోవా క్రిస్టా (డీజిల్)ని తిరిగి తీసుకువస్తోంది. అప్‌డేట్ చేయబడిన క్రిస్టా బుకింగ్ కోసం రూ. 50,000 చెల్లించాల్సి ఉంటుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 29, 2023, 12:17 PM IST
  • ఇన్నోవా క్రిస్టా మళ్లీ వచ్చేస్తోంది
  • ప్రారంభమైన బుకింగ్స్
  • ఐదు రంగుల ఎంపికలలో ఇన్నోవా క్రిస్టా
Toyota Innova Crysta Diesel Bookings: ఇన్నోవా క్రిస్టా డీజిల్ వెర్షన్ మళ్లీ వచ్చేస్తోంది.. ప్రారంభమైన బుకింగ్స్!

Toyota Innova Crysta Diesel ReLaunch 2023: ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టయోటా' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సూపర్ మోడల్స్ అందించింది. ఇన్నోవా, ఇన్నోవా క్రిస్టా బాగా పాపులర్ అయ్యాయి. అయితే టయోటా తన ప్రసిద్ధ ఎంపీవి ఇన్నోవా క్రిస్టా (డీజిల్)ని తిరిగి తీసుకువస్తోంది. అధిక డిమాండ్ కారణంగా గత సంవత్సరం బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పుడు నవీకరించబడిన వెర్షన్‌ను విడుదల చేసింది. డీజిల్-మాన్యువల్ పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే రానుంది. మునుపటిలాగా G, GX, VX మరియు ZX అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అప్‌డేట్ చేయబడిన క్రిస్టా బుకింగ్ కోసం రూ. 50,000 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న షో రూంకి వెళ్లాల్సి ఉంటుంది.

టొయోటా ఇన్నోవా హైక్రాస్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపీవి ఇన్నోవా క్రిస్టా రాబోతోంది. దీని 2.4-లీటర్ డీజిల్ యూనిట్ (ఇది రాబోయే ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీకరించబడింది) అలాగే ఉంచబడింది. ఇది ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తొలగించబడింది. ఇన్నోవా క్రిస్టా డీజిల్ ఐదు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది.  వైట్ పెర్ల్ క్రిస్టల్ షైన్, సూపర్ వైట్, సిల్వర్, యాటిట్యూడ్ బ్లాక్ మరియు అవాంట్ గార్డ్ బ్రాంజ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 

ఎంపీవి ఇన్నోవా క్రిస్టా.. ఇంతకుముందు కంటే బోల్డ్ లుక్ ఉంటుంది. ఇది ఎంపీవి రిఫ్రెష్ ఫ్రంట్‌ను కలిగి ఉంటుంది. ఈ కార్ 8-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక వెంట్లతో కూడిన ఆటో AC మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లను పొందుతుంది. భద్రత కోసం MPVకి 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 7-సీటర్ లే అవుట్‌ను ప్రామాణికంగా పొందుతుంది. అయితే ఎనిమిది-సీట్ల లే అవుట్ G, Gx మరియు Vx ట్రిమ్‌లలో కూడా అందించబడుతుంది.

Also Read: U-19 Womens T20 World Cup 2023 Final: న్యూజిలాండ్‌పై ఘన విజయం.. ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో భారత్!

Also Read: IND Playing XI for 1st T20I vs NZ: పృథ్వీ షాకి చోటు లేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News