UPI Services with Credit Card: గత 3-4 ఏళ్లుగా దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు లేదా డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీసీఐ ద్వారా యూపీఐ సేవల్ని ఇటీవలే అందుబాటులో తీసుకొచ్చింది. తాజాగా కొటక్ మహీంద్ర బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ సేవల సదుపాయం కల్పించనుంది.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న యూపీఐ చెల్లింపుల్ని దృష్టిలో ఉంచుకుని కొత్త కొత్త సేవలు అందిస్తున్నారు. యూపీఐ ద్వారా డబ్బులు పంపేందుకు లేదా పొందేందుకు వీలుంటుంది. ఇప్పటి వరకూ యూపీఐ విధానానికి కేవలం డెబిట్ కార్డులకే అనుమతి ఉంది. ఇప్పుడు తొలిసారిగా క్రెడిట్ కార్డుల్ని యూపీఐ సేవలకు అనుసంధానిస్తున్నారు. ముందుగా కోటక్ మహీంద్ర బ్యాంక్ ఈ సేవల్ని ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. క్రెడిట్ కార్డు కలిగిన కస్టమర్లు రోజువారీ యూపీఐ సేవలు కార్డుని అనుసంధానం చేసుకోవచ్చు. కోటక్ మహీంద్ర రూపే క్రెడిడ్ కార్డ్ హోల్డర్లకు మాత్రమే ఈ సేవలు వర్తించనున్నాయి. బీమ్, పేటీఎం, ఫోన్ పే, ప్రీఛార్జ్, పేజాప్‌తో సహా కొన్ని యూపీఐ యాప్‌లతో ఈ సేవలు పొందవచ్చు.
దీని ప్రకారం ఇకపై కోటక్ మహీంద్ర బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డుల్ని యూపీఐ యాప్స్‌తో లింక్ చేసుకోవచ్చు. ముందుగా సంబంధిత యాప్ ఓపెన్ చేసి లింక్డ్ బ్యాంక్ ఎక్కౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత యాడ్ ఎక్కౌంట్ క్లిక్ చేసి క్రెడిట్ కార్జు ఆప్షన్ క్లిక్ చేయాలి. క్రెడిట్ కార్డు ఎంచుకున్న తరువాత మొబైల్ నెబర్, క్రెడిట్ కార్డు చెల్లుబాటు, ఇతర వివరాలు ఎంపిక చేయాలి. ఆ తరువాత ఓటీపీ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇక రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులైతే కెనరా బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్, యూనియన్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కూడా యూపీఐ సేవలు పొందవచ్చు.
Also read: iPhone 12 Pro Max @ Half Price: సగం ధరకే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్.. ఒక లుక్కేస్తే పోలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook