Paytm Trouble: భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీవ్ర ఆంక్షల నేపథ్యంలో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పదవి పోయింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) చైర్మన్ పదవిని ఆయన కోల్పోయారు. ఈ సందర్భంగా తన పదవికి శేఖర్ శర్మ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో పేటీఎం సంక్షోభం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. ఆర్బీఐ ఆంక్షలతో సతమతమవుతున్న పేటీఎంలో మరిన్ని భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఇక బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నియమించుకుంది.
Also Read: PayTm: పేటీఎమ్‌కు భారీ ఊరట.. ఆర్బీఐ ప్రకటనతో యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చా లేదా?
తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలను నిలిపివేసింది. ఫాస్టాగ్‌లను మార్చి 15వ తేదీ తర్వాత రీచార్జి చేసుకోవడానికి వీలు లేదు. నగదు పూర్తయ్యే వరకే వినియోగించే అవకాశం మాత్రమే ఉంది. ఇంకా గడువు ముగియకముందే చైర్మన్ పదవిని కోల్పోవడం గమనార్హం. ఇక పీపీబీఎల్ బోర్డు పునర్నియామకం కూడా పూర్తయ్యింది. ఈ విషయాన్ని పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ వెల్లడించింది.
Also Read: RX 100 Bike: గుడ్‌న్యూస్.. మళ్లీ రానున్న 'యమహా ఆర్‌ఎక్స్ 100'.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే
కొత్త బోర్డు ఇదే..
చైర్మన్ రాజీనామా అనంతరం పీపీబీఎల్ బోర్డు పునర్ నియామకం చేపట్టారు. బోర్డు డైరెక్టర్లుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి, మాజీ ఐఏఎస్ రజనీ సెఖ్రి సిబల్ నియమితులయ్యారు. ఇక విజయ్ శేఖర్ శర్మ స్థానంలో కొత్త చైర్మన్ ఎవరు అనేది త్వరలోనే ప్రకటిస్తామని వన్ 97 కమ్యూనికేషన్ ప్రకటించింది. చైర్మన్ ఎంపిక ప్రక్రియను పీపీబీఎల్ కొత్త బోర్డు ప్రారంభిస్తుందని వెల్లడించింది.
తాజాగా జరిగిన పరిణామాలపై పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ సురీందర్ చావ్లా స్పందించారు. 'కొత్త బోర్డు సభ్యుల నైపుణ్యం, అనుభవం మా పాలనా నిర్మాణాలు, కార్యాచరణ ప్రమాణాలను పెంపొందిస్తుంది. అంతేకాకుండా మాకు మార్గనిర్దేశం చేయడంలో కూడా దోహదం చేస్తుంది' అని తెలిపారు. కాగా ఫిబ్రవరి 29వ తేదీ తర్వాత బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఫిన్‌టెక్ సంస్థను ఆదేశించిన ఆర్బీఐ ఆ గడువను మార్చి 15వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ గడువలు ముగిసిన అనంతరం పేటీఎం భవితవ్యం ఏమిటో తేలనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి