Adani Effect on LIC: అదానీ గ్రూప్ పతనంతో ఎల్ఐసీలో మీరు పెట్టిన డబ్బులు కోల్పోనున్నారా, ఎల్ఐసీపై ప్రభావముంటుందా లేదా

Adani Effect on LIC: అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఇన్వెస్టర్లతో పాటు ఎల్ఐసీ విషయంలో కూడా ఆందోళన వ్యక్తమౌతోంది. ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టినవారు నష్టాలు ఎదుర్కోవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు నిజమేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 5, 2023, 08:50 AM IST
Adani Effect on LIC: అదానీ గ్రూప్ పతనంతో ఎల్ఐసీలో మీరు పెట్టిన డబ్బులు కోల్పోనున్నారా, ఎల్ఐసీపై ప్రభావముంటుందా లేదా

అదానీ గ్రూప్‌కు 2023 ప్రారంభమౌతూనే కష్టాలెదురయ్యాయి. జనవరి 24న ప్రచురితమైన హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్‌ను తీవ్రమైన నష్టాల్లో పడేసింది. ఇంకా ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అదానీ గ్రూప్ షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది. ఆ వివరాలు మీ కోసం..

ఇటీవల అదానీ గ్రూప్ 20 వేల కోట్ల ఐపీవోను నిలిపివేసింది. నేరుగా అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసినవారితో పాటు ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టినవారిలో కూడా ఆందోళన వ్యక్తమౌతోంది. అదానీ గ్రూప్‌కు బీటలు వారుతున్న నేపధ్యంలో..ఎల్ఐసీ ఇన్వెస్టర్లు భయపడాల్సిన పరిస్థితి ఉందా లేదా అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసినవారు అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే..ఎల్ఐసీ అదానీ గ్రూప్ బాండ్లు, ఈక్విటీలో దాదాపు 36.5 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికకు ముందు దీని విలువ 77 వేల కోట్ల రూపాయలుగా ఉంది. అదానీ షేర్లలో క్షీణతతో ఎల్ఐసీ బాండ్లు, ఈక్విటీ విలువ కూడా వేగంగా తగ్గిపోతూ వస్తోంది. 

ఫలితంగా ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టినవారంతా ఆందోళనలో పడ్డారు. వాస్తవానికి ఎల్ఐసీ ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్ఐసీ అదానీ బాండ్ల కొనుగోలులో చేసిన పెట్టుబడి ఎల్ఐసీలో 1 శాతం కంటే తక్కువే. ఎల్ఐసీ మొత్తం విలువ 41.66 లక్షల కోట్ల కంటే ఎక్కువే. అందుకే ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ విషయంలో, ఆ కంపెనీ షేర్ల పతనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎల్ఐసీ ఈ బాండ్లను ఇంకా విక్రయించలేదు. అదానీ గ్రూప్ పతనం వల్ల ఎల్ఐసీకు నష్టమైతే ఎదురైంది. కానీ ఎల్ఐసీలో డైరెక్ట్ ఇన్వెస్టర్లకు దీనివల్ల ఏ నష్టమూ ఉండదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఎందుకంటే అదానీ గ్రూప్ షేర్లు తిరిగి పెరిగే అవకాశాలున్నాయంటున్నారు.

Also read: Best Mahindra Cars 2023: రూ 5.50 లక్షలకే మహీంద్రా ఎక్స్‌యూవీ 500.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News