60 Years Old Woman Raped: మంచం పట్టిన 60 ఏళ్ల వృద్ధురాలిపై ఘోరం

60 Years Old Woman Raped: అసలే వృద్ధురాలు.. ఆపై పక్షవాతంతో బాధపడుతున్న ఒంటరి మహిళ అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పలుసార్లు ఆమెపై హత్యాచారానికి పాల్పడ్డాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 07:08 PM IST
60 Years Old Woman Raped: మంచం పట్టిన 60 ఏళ్ల వృద్ధురాలిపై ఘోరం

60 Years Old Woman Raped : కామాంధుల ఆగడాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఎన్ని చట్టాలు చేసినా.. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుల అరాచకాలకు అడ్డుకట్ట పడటం లేదు. అభం శుభం తెలియని చిన్నారుల నుంచి మంచానికే పరిమితమైన వృద్ధ మహిళల వరకు కామాంధుల కామ వాంఛలకు బలి కాని వారు లేదు. తాజాగా మహారాష్ట్రలోని నాసిక్ లో దారుణం చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైన 60 ఏళ్ల వృద్ధురాలిపై కన్నేసిన ఓ కామాంధుడు.. అర్థరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

అసలే వృద్ధురాలు.. ఆపై పక్షవాతంతో బాధపడుతున్న ఒంటరి మహిళ అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పలుసార్లు ఆమెపై హత్యాచారానికి పాల్పడ్డాడు. అరిచినా, ఎవరికైనా చెప్పినా చంపేస్తానని బెదిరించాడు. ఆమెపై కామ వాంఛలు తీర్చుకోవడమే కాకుండా.. వెళ్లిపోయే ముందు ఆ వృద్ధురాలితో అభ్యంతరమైన రీతిలో ఫోటోలు తీసుకున్నాడు.

బాధితురాలు మరునాడు తన ఇంటి పక్కనే ఉండే తన సోదరుడికి చెప్పుకుని బోరుమంది. అతడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్ధురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసులో అదే ఏరియాలో నివాసం ఉంటున్న 22 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కోర్టు నిందితుడిని మూడు రోజుల పాటు పోలీసు కస్టడికి అనుమతించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడి గురించి సీనియర్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇప్పటికే అతడిపై హత్యాయత్నం కేసు నమోదై ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి : Teacher's Love Letter: మైనర్ విద్యార్థికి టీచర్ లవ్ లెటర్.. ఏం రాశాడో తెలుసా ?

ఇది కూడా చదవండి : Ghee From Animal Fat: తక్కువ రేటుకే నెయ్యి దొరుకుతుందని లొట్టలేస్తూ తింటున్నారా.. ఇది చదివితే ఇక ముట్టుకోరు!

ఇది కూడా చదవండి : Extra Marital Affairs: హవ్వ!! మరీ ఇంత బరితెగింపా ? లవర్‌తో మహిళ‌ అక్రమ సంబంధం.. అతడి కోసం కుటుంబంతోనే గొడవ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News