California Helicopter Crash: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫిబ్రవరి 9వ తేదీన ఘోర ప్రమాదం సంభవించింది. రాత్రి 10 గంటల సమయంలో హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది. రాత్రిపూట ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. చాలా ఎత్తు నుంచి కుప్పకూలడంతో హెలికాప్టర్ కాలిబూడిదైపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నైజీరియాకు చెందిన ప్రముఖ యాక్సెస్ బ్యాంక్ సీఈఓ హెర్బర్ట్ విగ్వే కూడా ఉన్నారు. అతడితోపాటు భార్య, కుమారుడు కూడా మృతి చెందడం మరింత విషాదానికి గురి చేసింది. ప్రమాదంలో విగ్వే మరణించడంతో నైజీరియాలో తీవ్ర విషాదం అలుముకుంది. బ్యాంకింగ్, పారిశ్రామిక వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.
Also Read: Bajrang Dal: ప్రేమికులకు అలర్ట్.. వాలంటైన్స్ డే రోజు బయటతిరగొద్దని బజరంగ్ దళ్ హెచ్చరిక
పామ్ స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్టు నుంచి ఈసీ 120 అనే హెలికాప్టర్ ఆరుగురు ప్రయాణికులతో లాస్‌వెగాస్‌కు బయల్దేరింది. లాస్‌వెగాస్‌కు 128 కిలోమీటర్ల దూరంలో కాలిఫోర్నియా-నెవాడా సరిహద్దులో ఉన్న మొజావో ఎడారిలో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. రాత్రి వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో అందరూ 30 ఏళ్లలోపు వయసువారే ఉన్నారని సమాచారం.
Also Read: Honey Trap: సింగోటం హత్యకేసులో బిగ్ ట్విస్ట్.. ఇది తల్లీకూతురు నడిపే 'క్రైమ్ కథా చిత్రం'
ప్రమాదంలో యాక్సెస్ బ్యాంక్ సీఈఓ హెర్బర్ట్ విగ్వే మరణించినట్లు ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యదర్శి ఎంగొజి ఒకొంజో ఎవాల ధ్రువీకరించారు. రాత్రి పది గంటల సమయంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో హెర్బర్ట్ మరణించినట్లు ఆయన 'ఎక్స్'లో పోస్టు చేశారు. 'యాక్సెస్ బ్యాంక్ గ్రూపు సీఈఓ హెర్బర్ విగ్వే మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అతడి మృతి తీరని లోటు. ప్రమాదంలో అతడి భార్య, కుమారుడు కూడా ఉండడం మరింత విషాదం' అని ఎంగొజి పోస్టు చేశారు.
కాగా అమెరికాలో తరచూ హెలికాప్టర్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీన శాండియాగోలో ఓ హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఆ ఘటన మరువకముందే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం తీరని వేదనను మిగిలింది. వరుస ప్రమాదాలపై అక్కడి విమానయాన శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. హెర్బర్ట్ విగ్వే హెలికాప్టర్ ప్రమాదంపై ఇప్పటికే అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి హెలికాప్టర్ శకలాలను పరిశీలించారు. ఘటనా స్థలంలో ప్రమాద తీరును అధ్యయనం చేసేందుకు ప్రత్యేక అధికారులు అక్కడికి చేరుకున్నారు. త్వరలోనే కారణం వెల్లడిస్తామని అక్కడి పోలీస్ ఉన్నత అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook