Singotam Ramu Murder Case: హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో సింగోటం రాము హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పద్ధతి ప్రకారం అతడిని హత్య చేయగా.. హత్యకు సుపారీ ఇచ్చిన మహిళల చరిత్ర తీస్తే సినిమా అవుతుంది. రాస్తే పెద్ద నవల అవుతుంది. సినిమాల్లో మించిన ట్విస్టులు ఈ హత్య కేసులో ఉన్నాయి. హత్యకు సుపారీ ఇచ్చిన అమ్మాయి, ఆ యువతి తల్లి నేర చరిత్ర మహా గొప్పగా ఉంది.
Also Read: Bajrang Dal: ప్రేమికులకు అలర్ట్.. వాలంటైన్స్ డే రోజు బయటతిరగొద్దని బజరంగ్ దళ్ హెచ్చరిక
తెలంగాణలోని కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సింగోటం రాము హత్య కేసులో తల్లీబిడ్డల పాత్ర వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వారెవరు అని పోలీసులు విచారణ చేయగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తల్లీకూతుళ్లు మామూలు ముదుర్లు కాదని తేలింది. వారి చరిత్ర అంతా పోలీస్ రికార్డుల్లో భద్రంగా ఉంది. తల్లి హిమంబీపై 5 కేసులు నమోదై ఉన్నాయ. వారు చేసేదే నేర వృత్తి. బెదిరింపులకు పాల్పడడం, వ్యభిచార రొంపిలో ఇతర అమ్మాయిలను దింపడం, కూతురిని వలవేసి ఆకర్షితులైన పురుషుల నుంచి అందినంత దోచుకోవడం హిమంబీ, ఆమె కూతురు నసీమా.
Also Read: Rythu Bandhu: భూ యజమానులకు రేవంత్ సర్కార్ షాక్.. రైతుబంధు రానట్టే!
డబ్బున్న పెద్ద మనుషులని ట్రాప్ చేసి తల్లీకూతుళ్లు దోచుకుంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనికి కన్న కూతురు నసీనాను హిమంబీ ఎరగా చూపెట్టేది. వీరి వలకు చిక్కి ఎందరో బడా బాబులు భారీగా సమర్పించుకున్నారు. బయటకు చెబితే పరువు పోతుందనే ఉద్దేశంతో వీరిపై ఫిర్యాదు రాలేదు. హత్యకు గురైన పుట్టా రాము అలియాస్ సింగోటం రామును కూడా హిమాంబీ తన కూతురును ఎర వేసింది. రాముని లొంగదీసుకున్న హిమంబీ అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు కొట్టేసింది. తల్లీకూతుళ్ల వలకు చిక్కిన రాము లక్షలాది రూపాయలు వారికిచ్చి మోసపోయాడు.
ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని తరచూ అడుగుతుండంతోనే రాము హత్యకు తల్లీకూతుళ్లు ప్రణాళిక వేశారు. అడ్డు తొలగించే ఉద్దేశంతో రాము సింగోటం ప్రత్యర్థులకు వీరు తల్లీకూతుళ్లు చేతులు కలిపారు. ప్రణాళిక ప్రకారం రాము ప్రత్యర్థి మణికంఠ దగ్గర్నుంచి డబ్బులు తీసుకుని ఆ తల్లీకూతురు హనీ ట్రాప్‌నకు పాల్పడ్డారు. నసీమాతో కాల్ చేయించిన రామును ట్రాప్ చేసింది.
నసీమా కోసం వచ్చి ప్రత్యర్థుల చేతిలో బలైన రాము సింగోటం. రాము సింగోటం హత్య కేసులో ఇతర నిందితులతో పాటు తల్లి కూతుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు. గతంలోనూ పలువురు వ్యక్తులను ఇదే విధంగా హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణ లో వెల్లడి. ఎల్‌ఎన్ నగర్‌లో ఉంటున్న ఇంటిని అమ్మినా ఖాళీ చేయకుండా ట్రాప్. తప్పుడు కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేసినట్లు వెల్లడి. ఇల్లు వెనక్కి రాయాలని సదరు వ్యక్తికి కూడా కూతురుని ఎరగా వేసిన హిమాంబీ. అంగీకరించకపోవడంతో రెండు కేసులు పెట్టి బెదిరింపులు పాల్పడ్డారు. వీరి బారినపడి చాలా మంది మోసపోయి ఉంటారని తెలిసింది. హిమాంబీ, ఆమె కూతురుతో సహా ఇతర కుటుంబసభ్యులపై ఫిర్యాదులు చేయడానికి బాధితులు ముందుకు వస్తున్నారని సమాచారం.
తల్లీకూతుళ్లపై కేసులు ఇలా..
2017లో షేక్ సనా అనే అమ్మాయితో వ్యభిచారం చేయిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన హిమాంబి
2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తిని బ్లాక్ మెయిల్‌కు పాల్పడి హిమాంబీ రూ.3 లక్షలు దోపిడీ
2018లో రేణుక అనే అమ్మాయితో వ్యభిచారం చేయించిన కేసులో ఇమాంబి అరెస్ట్
2019లో తన కూతురు నసీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ హిమాబీ తప్పుడు ఫిర్యాదు చేసి బెదిరింపులకు పాల్పడింది.
2020లో జూబ్లీహిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన హిమంబీ
కూతురుతో కలిసి ఇతర అమ్మాయిలను వ్యభిచారం చేయిస్తూ సంపాదన.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook