Allagadda Murder Case: 11 ఏళ్ల చిన్నవాడితో మహిళ వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య.. ఇలా దొరికిపోయారు

Auto Driver Murder Case: ఆళ్లగడ్డ ఆటో డ్రైవర్ హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను కడతేర్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2022, 11:06 AM IST
  • ఆళ్లగడ్డలో ఆటో డ్రైవర్ హత్య
  • ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Allagadda Murder Case: 11 ఏళ్ల చిన్నవాడితో మహిళ వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య.. ఇలా దొరికిపోయారు

Auto Driver Murder Case: ఆమె వయసు 33.. అతడి వయసు 22.. ఆమెకు అప్పటికే పెళ్లి అయింది. ఇద్దరికి ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ఆ మహిళ పక్కా స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. ఎవరో చంపేశారంటూ కొత్త నాటానికి తెరలెపారు. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా..

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన కరీముల్లా, మాబ్బి భార్యాభర్తలు. కరీముల్లా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మాబ్బికి కడప జిల్లా పెద్దముడియం మండలం జె.కొత్తపల్లి గ్రామానికి చెందిన వంశీ కుమార్ రెడ్డి అనే యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అడ్డుగా ఉన్న కరీముల్లాను ఎలా తొలగించుకోవాలని పక్కా ప్లాన్ వేశారు. 

ఈ నెల 1న రాత్రి కరీముల్ల మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అతను ఇంట్లో నిద్రలో ఉండగా ప్రియుడిని పిలిపించిన మాబ్బి.. ఇద్దరు కలిసి తీగతో మెడకు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకువెళ్లి పొదల్లో పారేసి.. వెళ్లిపోయారు. ఈ నెల 8న లింగందిన్నె రహదారిలో విద్యుత్ ఉపకేంద్రం వద్ద పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. తనపై అనుమానం రాకుండా భర్త మృతదేహంపై పడి రోదించింది. కేసును తప్పుదోవ పట్టించేందుకు ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. అనుమానితులను విచారించినా నిందితులు ఎవరో తేలలేదు. దీంతో మాబ్బి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె ఫోన్ కాల్ డేటాను చెక్ చేశారు. ఆమె ఎక్కువగా వంశీరెడ్డితో మాట్లాడినట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెంకట్రామయ్య వెల్లడించారు.

Also Read: India vs Netherlands: మరి కాసేపట్లో నెదర్లాండ్స్‌తో టీమిండియా పోరు.. వీళ్లపైనే అందరి కళ్లు  

Also Read: Bandi Sanjay: ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్ధరూపాయికి కూడా కొనరు.. టీఆర్ఎస్‌కు బండి సంజయ్ కౌంటర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News