Radha's Murder Case: రాధను హత్య చేసింది స్నేహితుడు కాదు.. భర్తే

సిగరెట్లతో కాల్చి, కారుతో తొక్కించి.. మొహంపై బండ రాయితో కొట్టి చంపిన రాధ మర్డర్ కేసు అందరిని ఆశ్చర్యానికి లోను చేస్తుంది. దారుణ హత్య విషయంలో మొదట కాశి రెడ్డి అనుకున్నప్పటికీ, ఇపుడు భర్త మోహన్ రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2023, 11:37 AM IST
Radha's Murder Case: రాధను హత్య చేసింది స్నేహితుడు కాదు.. భర్తే

Radha's Murder Case: ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామ శివారులో కోట రాధ అనే వివాహితని అత్యంత దారుణంగా హతమార్చిన కేసు అనూహ్య మలుపు తీసుకుంది. కారుతో తొక్కించి.. సిగరెట్లతో కాల్చి ఆ పై బండ రాయితో మొహం పై మోది మరీ చంపిన వ్యక్తి ఎవరు అనేది తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణానికి కారణం అనుమానం అనేది పోలీసుల అభిప్రాయం.

కోట రాధను ఆమె స్నేహితుడు కేతిరెడ్డి కాశి రెడ్డి చంపాడు అంటూ పోలీసులు మొదట అనుమానించారు. రాధ చివరగా కాశి రెడ్డితో ఫోన్ లో చాటింగ్‌ చేయడం తో పాటు అతడు రమ్మంటే వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించి ఆమె మరణంకు కేతిరెడ్డి కాశి రెడ్డి కారణం.. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఉండేందుకు అత్యంత కిరాతకంగా చంపాడు అంటూ ప్రచారం జరిగింది.

రాధ చనిపోయిన తర్వాత ఆమె భర్త కోట మోహన్‌ రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పాటు కాశి రెడ్డి ని ప్రశ్నించిన పోలీసులకు ఈ కేసులో ఇంకా ఏదో తేడా ఉందనే అనుమానం వచ్చింది. దాంతో సూర్యపేట జిల్లా కోదాడలో శుక్రవారం సాయంత్రం రాధ అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఆమె భర్త అయిన కోట మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులు కాస్త లోతుగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 

రాధను భర్త మోహన్‌ రెడ్డి చంపేసినట్లుగా నిర్థారణ అయ్యింది. మరి కొందరితో కలిసి మోహన్ రెడ్డి అత్యంత కిరాతకంగా భార్య రాధను చంపేశాడు. మోహన్ రెడ్డి విచారణ లో పలు కీలక అంశాలు బయట పడ్డాయి. రాధ తన స్నేహితుడు కాశిరెడ్డి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని రూ.80 లక్షల వరకు అప్పుగా సహాయం చేసింది. అతడికి రాధ సహాయం చేయడం మోహన్‌ రెడ్డికి అస్సలు ఇష్టం లేదు. 

Also Read: 2000 Rupees Note: బ్యాంక్‌కు వెళ్లకున్నా రూ.2000 నోట్లను ఇలా మార్చుకోండి..!  

కాశి రెడ్డి విషయంలో గత కొన్నాళ్లుగా మోహన్ రెడ్డి మరియు రాధ మధ్య గొడవ సాగుతోంది. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లుగా మోహన్ రెడ్డి అనుమానిస్తూ వచ్చాడు. ఆ డబ్బు తీసుకు రావాలంటూ రాధ ను పదే పదే ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. 

దాంతో రాధ ను చంపేసి ఆ కేసును కాశి రెడ్డిపైకి వచ్చేలా చేయాలని మోహన్‌ రెడ్డి భావించాడు. అందుకు గాను కేతిరెడ్డి కాశి రెడ్డి పేరు తో ఒక సిమ్ కార్డును కొనుగోలు చేయడం జరిగింది. ఆ సిమ్ కార్డ్ నుండి కేతిరెడ్డి మాదిరిగా రాధ తో చాటింగ్‌ చేసి డబ్బులు ఇస్తాను అంటూ నమ్మించి ఈనెల 17వ తారీకున ఆమెను స్వగ్రామం కనిగిరి రప్పించాడు మోహన్‌ రెడ్డి.

ఆ సమయంలో మోహన్ రెడ్డి ముందుగానే మాట్లాడి పెట్టుకున్న వారు రాధను కారు ఎక్కించుకుని శివారు ప్రాంతంకు తీసుకు వెళ్లారు. అక్కడ అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు. కారుతో తొక్కించిన తర్వాత కూడా బతికే ఉంటుందేమో అనే అనుమానంతో తలపై బండతో మోది మరీ హత్య చేశారు. రాధ హత్య కేసులో మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు కాగా అతడికి సహకరించిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.

Also Read: Medak Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Business NewsRs 2000 noteRBIRBI Newsbanks

Trending News