Caught On CCTV Cameras: యజమానే దొంగగా మారి , వేషం మార్చి మరీ తన భవనంలోనే ఓ షట్టర్ అద్దెకి తీసుకున్న వ్యక్తి దుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కలకలం రేపింది. తన బిల్డింగ్ లోని మడిగెను కిరాయికి తీసుకొని నిర్వహిస్తున్న ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులో, బిల్డింగ్ యజమాని దొంగతనం చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జల్సాలకు అలవాటు పడిన ఓ బిల్డింగ్ యజమాని కుమారుడు, ఎవరికీ అనుమానం రాకుండా యువతి వేషాధారణ ధరించి తమ భవనంలోని ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడు. భార్యకు సంబంధించిన సవరం, అమె డ్రెస్ ధరించి గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేశాడు.
చోరీకి పాల్పడిన దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆ సీసీటీవీ కెమెరా దృశ్యాలను ఆధారంగా సమర్పిస్తూ సదరు దుకాణదారుడు ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగానే విచారణ చేపట్టిన పోలీసులు 48 గంటల్లోనే కేసును ఛేదించారు. ఎల్లారెడ్డిపేటలోని లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణంలో చోరి చేసిన ఆ బిల్డింగ్ యజమాని రామిండ్ల సుధీర్‌ను రిమాండ్‌కి తరలించామని ఎస్సై రమాకాంత్ మీడియాకు తెలిపారు.
రామిండ్ల నాంపల్లికి చెందిన బిల్డింగ్‌లో సింగారం గ్రామానికి చెందిన గనగోని బంటి లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9న రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లిన లక్ష్మీ నారాయణ 10వ తేదీన దుకాణం తెరవలేదు. 11న ఉదయం దుకాణానికి వచ్చి చూడగా వెనుక ఉన్న తలుపు తీసి కనిపించింది. కౌంటరులో దాచిన రూ. 3500 నగదు అపహరణకు గురైందని గుర్తించిన లక్ష్మీ నారాయణ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి : Eetala Rajender Demands For MSP: కేసీఆర్ ఇవ్వాల్సింది రైతు బందు కాదు.. ఈటల ఫైర్
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. ముందు చోరి చేసింది యువతిగా భావించారు. అనుమానం వచ్చిన పోలీసులు సుధీర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, తానే తన భార్యకు సంబంధించిన సవరంతో పాటు దుస్తులు ధరించి దొంగతనానికి పాల్పడ్డానని సుధీర్ అంగీకరించాడు. పోలీసులు సుధీర్‌పై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇంత బతుకు బతికి ఇంటి వెనుక చచ్చాడన్న అదేదో సామెత చందంగా బిల్డింగ్‌లో మడిగెలు అద్దెకు ఇచ్చే యజమాని కుమారుడే అదే బిల్డింగ్‌లో చోరీకి పాల్పడటం ఏంటి అంటూ స్థానికులు ఈ ఘటన గురించి చర్చించుకోవడం వినిపించింది. పైగా స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో సైతం వైరల్ అవడంతో బిల్డింగ్ యజమాని పరువు కాస్తా గోవిందా అయింది.
ఇది కూడా చదవండి : Minister Harish Rao: బీజేపీ బిచాణ ఎత్తేసింది.. ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలు: మంత్రి హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి