Eetala Rajender Demands For MSP: కేసీఆర్ ఇవ్వాల్సింది రైతు బందు కాదు.. ఈటల ఫైర్

Eetala Rajender Demands For MSP: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు మామిడి రైతుల కోసం చేపట్టిన 48 గంటల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపి చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మామిడి రైతుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 06:11 AM IST
Eetala Rajender Demands For MSP: కేసీఆర్ ఇవ్వాల్సింది రైతు బందు కాదు.. ఈటల ఫైర్

Eetala Rajender Demands For MSP: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు మామిడి రైతుల కోసం చేపట్టిన 48 గంటల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపి చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మామిడి రైతుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... రైతు బంధు కాదు కేసీఆర్.. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులకు మార్కెట్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పసల్ బీమా యోజన పథకాన్ని కేసీఆర్ ఖతం పట్టించారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. 

కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు రైతులకు ఉపయోగం లేకుండా పేకాట రాయుళ్లకు, తాగుబోతులకు, దావతులకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి అని విమర్శించారు. 10 ఏండ్ల నుండి చెప్తున్న మాటల సర్కార్‌కు కాలం చెల్లింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీ పార్టీయే అని అన్నారు. తాండలలో గుడుంబా బంద్ చేసి కేసీఆర్ బాటిల్ వచ్చింది అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చివరకు చదువుకునే పిల్లల పరీక్ష పేపర్‌ని కూడా అమ్ముకొన్న లీకేజీల ప్రభుత్వం అని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.

మారుతున్న రాజకీయ సమీకరణలు
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు వేగంగా మరుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి  సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు సీటు  కేటాయించారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్‌ను బుధవారం బీజేపీ ముఖ్య నేతలు కలిశారు. 

ఇది కూడా చదవండి : Revanth Reddy Counter to KTR: మంత్రి కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, రాష్ట్ర నేతలు ఆచారి, అశ్వత్థామ రెడ్డి, తదితరులు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఇంట్లోనే ఆయనతో భేటీ అయ్యారు. వారు అక్కడే అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయా పార్టీల పరిస్థితులపై ఈటల రాజేందర్ బృందం ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. కాగా, బీఆర్ఎస్ పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి : Minister Harish Rao: బీజేపీ బిచాణ ఎత్తేసింది.. ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలు: మంత్రి హరీశ్‌ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News