Minister Harish Rao: బీజేపీ బిచాణ ఎత్తేసింది.. ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలు: మంత్రి హరీశ్‌ రావు

BRS Public Meeting in Husnabad: రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్‌ పార్టీది దొంగ డిక్లరేషన్ అని.. తెలంగాణలో బీజేపీ బిచాణ ఎత్తేసిందని కామెంట్స్ చేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 13, 2023, 04:17 PM IST
Minister Harish Rao: బీజేపీ బిచాణ ఎత్తేసింది.. ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలు: మంత్రి హరీశ్‌ రావు

BRS Public Meeting in Husnabad: తెలంగాణలో జనాలని నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు.. జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదని మంత్రి హరీశ్ రావు అన్నారు. నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా..? నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా..? అని ప్రజలను అడిగారు. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరినడిగినా మూడోసారి ఎవరు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అనే సమాధానం వస్తుందని అన్నారు. హుస్నాబాద్‌లో కూడా మూడోసారి సతీష్ కుమార్‌ను గెలిపించుకుందామన్నారు. ఈ నియోజకవర్గంలో తండాలు గ్రామపంచాయతీలు అయ్యాంటే.. గౌరెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందంటే.. ఇది కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. మిడ్ మానేర్ ద్వారా గోదావరి నీళ్లను హుస్నాబాద్ నియోజకవర్గానికి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. గండి మహాసముద్రం ఏడాదిలోపే నిర్మించి నిలిచామన్నారు. గౌరెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినా..  ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు.

"ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీది దొంగ డిక్లరేషన్. 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో రూ.2 వేల పెన్షన్ ఇచ్చారా..? కల్యాణ లక్ష్మి ఇచ్చారా..? మిషన్ భగీరథ మంచినీళ్లు ఇచ్చారా..? తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓట్లు అడుగుతాది. చీప్ ట్రిక్కులకు మాయమాటలకు ప్రజలు మోసపోవద్దు. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంది. గులాబీ సైనికులుగా మనం ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలను ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గడ్, కర్ణాటకలో తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు ఉన్నాయా..? కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఓట్లు అడగండి. 

కేసీఆర్ గారు మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, చెప్పని  హామీలను కూడా నెరవేర్చారు. కరోనా వచ్చినా కేంద్ర ప్రభుత్వం తిప్పలు పెట్టినా కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేసిండు. రాష్ట్రంలో బీజేపీ బిచాణ ఎత్తేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి భయంతోనే జమిలి ఎలక్షన్లు అంటోంది. తెలంగాణలో జనాలని నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు.. జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదు. ఇండియా-పాకిస్థాన్ మధ్య కొట్లాట.. హిందూ ముస్లింల కొట్లాట పెట్టి బీజేపీ గెలవాలనుకుంటోంది.." అని హరీశ్ రావు అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ఈ నెల 16న ప్రారంభం చేయనున్నారని.. దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయన్నారు. 

Also Read: 7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. నిబంధనల్లో మార్పు  

Also Read: Kishan Reddy: ఆయన ఎప్పుడో పెట్రోల్ పోసుకున్నాడు.. అగ్గిపెట్టే ఇంకా దొరకలేదు: కిషన్ రెడ్డి సెటైర్లు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News