Cloths Issue Attack: ఆరేసిన బట్టలపై మహిళల మధ్య కొట్లాట.. మటన్ కత్తితో తెగిన ఒకరి పీక

Clash Between With Two Women On Dry Cloths Issue: ఇద్దరి మహిళల మధ్య జరిగిన కొట్లాట ఒకరి ప్రాణం మీదకు తీసుకొచ్చింది. చిన్న విషయంలో ఆవేశానికి లోనైన ఓ యువకుడు ఒకరి హత్యకు ప్రయత్నించాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 3, 2024, 08:23 PM IST
Cloths Issue Attack: ఆరేసిన బట్టలపై మహిళల మధ్య కొట్లాట.. మటన్ కత్తితో తెగిన ఒకరి పీక

Cloths Issue In LB Nagar: ఇరుగు పొరుగున ఉంటున్నవారు సర్దుకుని పోవాల్సి ఉంంది. చిన్న చిన్న విషయానికే కొట్లాటకు దిగితే దారుణ పరిస్థితులకు దారి తీస్తాయి. తాజాగా బట్టలు ఆరుబయట ఆరేయడంపై వివాదం మొదలైంది. చిన్నగా మహిళల మధ్య మొదలైన వారి కుటుంబసభ్యుల వరకు చేరింది. అనంతరం వారికి చెందిన పురుషులు పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఫలితంగా ప్రస్తుతం ఒకరు కొన ప్రాణం మీద గిలగిలలాడుతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.

Also Read: Wrong Route Travel: బుల్లెట్‌ బండిపై రాంగ్‌రూట్‌లో ప్రయాణం.. రెండు ప్రాణాలు బలి

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని భరత్‌నగర్‌లో బుజ్జి, కమలమ్మ అనే కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తున్నాయి. పొరుగింట్లలోనే ఉంటుండడంతో బుజ్జి, కమలమ్మల మధ్య స్నేహం కుదిరింది. అయితే ఇంటి బయట ఆరవేసిన బట్టల విషయంలో చిన్న విషయం చినిగి చినిగి గాలివానగా మారింది. కమలమ్మ బట్టలు ఆరవేయడంతో బుజ్జి తీయాలని కోరింది. 'తీయను' అని కమలమ్మ బదులివ్వడంతో బుజ్జి విస్మయం వ్యక్తం చేసింది. ఎందుకు తీయవు అని ప్రశ్న మొదలవగా కొంత వాగ్వాదం జరిగింది. వారిద్దరి మధ్య గొడవ తీవ్రమై రోడ్డుపై కొట్టుకునే స్థాయికి చేరింది. 

Also Read: Reels Accident: వర్షంలో కేటీఎం బైక్‌పై రీల్స్‌.. కొడుకు మృతితో గుండెలవిసేలా తల్లి రోదన

బుజ్జి అనే మహిళ తమ్ముడు శంకర్‌ గొడవ మధ్యలోకి వచ్చాడు. దీంతో కమలమ్మ సోదరుడు కూడా వచ్చాడు. మహిళల గొడవ కాస్త పురుషుల మధ్య జరిగింది. పరస్పరం దూషించుకుంటున్న సమయంలో బుజ్జి సోదరుడు శంకర్‌పై క్షణికావేశానికి లోనైన కమలమ్మ సోదరుడు వెంటనే మటన్‌ కోసే కత్తిని తీసుకుని దాడికి పాల్పడడ్డాడు. మెడ భాగంలో తీవ్రంగా గాయపర్చడంతో శంకర్‌ కుప్పకూలాడు. వెంటనే స్థానికుల సహాయంతో బుజ్జి తన తమ్ముడు శంకర్‌ను ఆస్పత్రికి తరలించారు. 

తీవ్ర రక్తస్రావం కావడంతో శంకర్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. గొంతు భాగంలో తీవ్ర గాయమవడంతో శంకర్‌ కొనప్రాణాలతో ఉన్నాడు. రెండు రోజులు ఆగితే గానీ శంకర్‌ పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మటన్‌ కత్తితో దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News