France Crime: కట్టుకున్న భార్యపై దురాగతం, మత్తు మందిచ్చి 95 మందితో రేప్, రహస్యంగా వీడియో షూట్

France Crime: కట్టుకున్న భర్తే కిరాతకుడిగా మారాడు. ప్రతి రోజూ రాత్రి భార్యకు డ్రగ్స్ ఇచ్చి..విటుల్ని రప్పించి అత్యాచారం చేయించేవాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు..95 మందితో అత్యాచారం..ఆ పై వీడియో కూడా. నిర్ఘాంతపరిచే ఈ ఘటన జరిగిందెక్కడంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2023, 07:32 PM IST
France Crime: కట్టుకున్న భార్యపై దురాగతం, మత్తు మందిచ్చి 95 మందితో రేప్, రహస్యంగా వీడియో షూట్

France Crime: కంటికి రెప్పలా చూసుకోవల్సిన భార్యను సెక్స్ వస్తువుగా పరిగణించాడు. కాపాడాల్సిన అర్ధాంగిపై అందరిచే అత్యాచారం చేయించాడు. కట్టుకున్న భార్యపై జరిగే లైంగిక దాడిని సీక్రెట్ కెమేరాల్లో రికార్డు చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండి ఊచలు లెక్కబెడుతున్నాడు. 

వింటేనే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది. అత్యంత హేయమైన ఘటన ఇది. భార్యకు తెలియకుండా ఆమెపై పదేళ్లుగా లైంగిక దాడి చేయించిన నికృష్టుడు. ఇతడి పేరు డొమినిక్. ఈ ఘటన జరిగింది ఫ్రాన్స్‌లో. ఫ్రాంకోయిస్‌తో వివాహమై 50 ఏళ్లవుతున్నాయి. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. గత పదేళ్లుగా భార్యకు తెలియకుండా ఆమెపై పలువురితో కాదు..అనేకమందితో అత్యాచారం చేయిస్తున్నాడు. లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ప్రతిరోజూ రాత్రి భార్యకు ఆమె తినే ఆహారంలో యాంటీ యాంక్స్జైటీ డ్రగ్స్ ఇచ్చేవాడు. మత్తులో జారుకున్నాక..కొందరు వ్యక్తుల్ని ఇంటికి పిలిపించేవాడు. అందులో అతడి స్నేహితులు, జర్నలిస్టు, ఫైర్ మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, ఐటీ ఉద్యోగి, జైలు గార్డు ఇలా చాలామందే ఉన్నారు. 

ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 95 మందితో లైంగిక దాడి జరిపినట్టు తెలుస్తోంది. 2011 నుంచి 2020 మధ్యకాలంలో ఈ దారుణ లైంగిక దాడి జరిపించాడు. 95 సార్లు ఆమెకు తెలియకుండానే అత్యాచారానికి గురైంది. బయటి వ్యక్తులు ఇలా తన భార్యపై లైంగిక దాడి చేస్తుంటే సీక్రెట్ కెమేరాల్లో షూట్ చేసేవాడు ఈ కిరాతకుడు. అంతేకాకుండా..ఓ పెన్ డ్రైవ్‌లో ఎబ్యూసెస్ పేరుతో సేవ్ చేశాడట.

చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఫ్రాన్స్ పోలీసులు దర్యాప్రు చేపట్టారు. డొమినిక్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. ఆమెపై అత్యాచారం జరిపినవారిలో 51మందిని గుర్తించగా మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. దురాగతానికి పాల్పడినవారి వయస్సు 26-73 ఏళ్ల మధ్యలో ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. చాలామంది ఒకటి కంటే ఎక్కువసార్లే డొమినిక్ ఇంటికెళ్లినట్టు పోలీసులు తెలిపారు. 

ఈ ఫుటేజ్ బయటపడేవరకూ తనపై జరిగిన ఘోరం గురించి ఆ భార్యకు తెలియదు. విషయం తెలుసుకుని షాక్‌కు గురై తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. 2020లో మహిళలు దుస్తులు మార్చుకునే గదుల్లో రహస్య కెమేరాలు చిత్రీకరిస్తున్న కేసు దర్యాప్తులో పోలీసులకు అసలు విషయం తెలిసింది.

Also read: PM Modi US Visit: ఎలన్ మస్క్‌తో ప్రధాని మోదీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News