Karnataka husband brutally killed wife over family dispute in ramanagara: కొంత మంది పెళ్లి చేసుకుని తమ పార్ట్ నర్ పట్ల సైకోలుగా ప్రవర్తిస్తుంటారు. తమ భార్యకు చికెన్ వండటంరాలేదని, పప్పులో ఉప్పు వేయలేదని గొడవలు పడుతుంటారు. మరికొందరు భర్తలు భార్యలపై అనుమానం వ్యక్తం చేస్తుంటారు. ఎవరితో మాట్లాడిన, ఏ పనిచేసిన కూడా అనుమానంతో ఉంటారు. చివరకు ఫోన్లలో ఇంట్లో వాళ్లతో మాట్లాడిన కూడా భరించలేదు. మరికొందరు ప్రబుధ్దులు.. అందమైన అమ్మాయిల్ని భార్యలుగా చేసుకుంటారు. వారు పొరపాటున అందంగా రెడీ అయిన మంచి చీరలు ధరించిన కూడా భరించలేరు. ప్రతిదానికి ఏదో వంకతో, గొడవలు పడుతుంటారు.
ఇలాంటి ఘటనల్లో.. కొన్నిసార్లు మహిళలు కూడా తామేం తక్కువ తిన్నమా... అన్న విధంగా ప్రవర్తిస్తుంటారు. కట్టుకున్న భర్త ఉన్న.. పక్కచూపులు చూస్తుంటారు. భర్త ఆఫీసుకు వెళ్లగానే ఇతరులతో ఎఫైర్ లు పెట్టుకుంటారు. ఇలాంటి ఘటనలు బైటపడగానే.. కొన్నిసార్లు గొడవలు జరుగుతుంటాయి. కొంత మంది తమ వాళ్లపై దాడులు చేస్తుంటారు. మరికొందరు మాత్రం హత్యలు చేయడానికి సైతం వెనుకాడరు. పెళ్లై, పిల్లలున్న కూడా కొంత మంది ఇటీవల కాలంలో తమ వాళ్లను హత్యలు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు...
కర్ణాటకలోని రామనగర జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాగడి ప్రాంతంలో ఉమేష్ (33), దివ్య (32) లు భార్యభర్తలు. పెళ్లిచేసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు వీరికాపురం సజావుగానే సాగింది. కానీ ఉమేష్ తరచుగా తన భార్యను వేధిస్తుండేవాడు. ఆమె ఏమాంత్రం అందంగా రెడీ అయిన కూడా గొడవ పడేవాడు. దీంతో ఇటీవల వీరి గోడవలు కాస్త పీక్స్ కు వెళ్లాయి. ఆమె తన చేతి మీద సీతాకోక చిలుక ట్యాటును వేసుకుంది. దీని విషయంలో కూడా గోడవలు చోటు చేసుకున్నాయి. దీంతో దివ్య.. ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వీరి వ్యవహారం కాస్త కోర్టు వరకు వెళ్లింది.
ఇదిలా ఉండగా.. నిన్న (బుధవారం) రోజున కోర్టులో వీరి కేసు విచారణకు వచ్చింది. సదరు వివాహిత డైవర్స్ కావాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఉమేష్ సదరు దివ్యను మాట్లాడుకుందామని చెప్పి.. అడవిలో గల ఊజగల్లు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను అత్యంత క్రూరంగా హత్య చేశారు.
Read more: Modi Turban: ఇండిపెండెన్స్ డే వేళ ప్రత్యేక ఆకర్షణగా మోదీ తలపాగ.. ఈ సారి స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
ఆ తర్వాత చీలూర్ ప్రాంతంలో ఆమె శవాన్ని పడేశాడు. అంతేకాకుండా.. పోలీసుల దగ్గరకు వెళ్లి లొంగిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు మరో ముగ్గుర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన కాస్త సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter