Constable Shot Dead: ఏపీ పోలీస్‌ వర్గాల్లో దిగ్భ్రాంతి.. కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

Constable Shot Dead In Srisailam Police Staion: విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. పోలీస్‌ వర్గాల్లో ఈ సంఘటన తీవ్ర కలవరం సృష్టించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 16, 2024, 10:04 PM IST
Constable Shot Dead: ఏపీ పోలీస్‌ వర్గాల్లో దిగ్భ్రాంతి.. కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

Constable Shot Dead: ఉద్యోగ నిమిత్తం విధుల్లోకి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన పోలీస్‌ కానిస్టేబుల్‌ అనూహ్యంగా తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీస్‌ స్టేషన్‌లోనే సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. తెల్లవారుజామునే అతడు ఆత్మహత్యకు పాల్పడడంతో పోలీస్‌ శాఖ నిద్రలేచింది.

Also Read: Telangana Rains: ఇద్దరి ప్రాణం తీసిన పిడుగులు.. తెలంగాణలో భయంకరంగా అకాల వర్షాలు

నంద్యాల  జిల్లా శ్రీశైలం పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఏపీ పోలీసు వర్గాల్లో ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేసింది. శ్రీశైలం పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శివశంకర్ రెడ్డి (46) గురువారం తెల్లవారుజామున సుమారు ఐదు గంటల సమయంలో స్టేషనుకు వచ్చాడు. స్టేషన్‌లోని విశ్రాంతి గదిలో సర్వీస్ గన్‌ తీసుకుని తలకు కాల్చుకున్నాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Also Read: Snake Bite: తలుపు చాటున నక్కిన అత్యంత విషపూరిత పాము.. చటుక్కున కాటేసింది

 

గమనించిన తోటి పోలీస్‌ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆలోపే అతడు కన్నుమూశాడు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 2001వ బ్యాచ్‌కు చెందిన శివశంకర్ రెడ్డి స్వగ్రామం కర్నూలు. ఈ వార్తతో శ్రీశైలం పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సీఐ ప్రసాదరావు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని ఘటన స్దలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై ఉన్నతస్దాయి అధికారులు విచారణ చేపట్టారు. ఆత్మహత్య వీడియోలను చిత్రీకరించేందుకు పోలీసులు మీడియాను నిరాకరించారు. ఈ సంఘటనపై డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు తెలుసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x