Students Harassed Teacher: టీచర్‌నే ఐ లవ్ యూ అంటూ వేధించారు.. వీడియో కూడా తీశారు

Students says I Love You Teacher: పాఠశాలలో ఉపాధ్యాయురాలిని జాన్ అని పిలుస్తూ.. ఐ లవ్ యూ అని వెంటపడి వేధిస్తున్న వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతున్న సమయంలోనే మధ్య మధ్యలో ఐ లవ్ యూ అంటూ తోటి విద్యార్థుల ముందే అసభ్యకరంగా వేధించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2022, 10:03 AM IST
  • చదువు చెప్పే గురువును వెంటపడి వేధించారు
  • ఐ లవ్ యూ జాన్ అంటూ అరిచారు, వీడియోలు తీశారు
  • ఆఖరికి టీచర్ ఏం నిర్ణయం తీసుకుందంటే...
Students Harassed Teacher: టీచర్‌నే ఐ లవ్ యూ అంటూ వేధించారు.. వీడియో కూడా తీశారు

Students says I Love You Teacher: గురువులను తక్కువ చేస్తూ, గురువులను ఆట పట్టిస్తూ వస్తోన్న సినిమాల ప్రభావమో లేక పెరిగిన వాతావరణం పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ కొంతమంది యువతలో విద్యార్థి దశలోనే నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. అల్లరి చేష్టలు, ఆకతాయితనం శృతి మించిపోతున్నాయి. అమ్మ లాంటి ఉపాధ్యాయురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడం, చదువులు చెప్పే పంతులమ్మను వేధించడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. 

మీరట్ లోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిని జాన్ అని పిలుస్తూ.. ఐ లవ్ యూ అని వెంటపడి వేధిస్తున్న వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తరగతి గదిలో ఉపాధ్యాయురాలు పాఠాలు చెప్పేటప్పుడు ఆమెను జాన్ పిలుస్తూ ఏకాగ్రతను డిస్టర్బ్ చేయడమే కాకుండా ఆమెను పాఠం చెప్పనివ్వకుండా వేధించసాగారు. ఉపాద్యాయురాలు పాఠాలు చెబుతున్న సమయంలోనే మధ్య మధ్యలో ఐ లవ్ యూ అంటూ తోటి విద్యార్థుల ముందే అసభ్యకరంగా వేధించారు. క్లాస్ రూమ్ బయట కూడా ఆ టీచర్‌ని ఇబ్బంది పెడుతూ కామెంట్స్ చేశారు. అంతటితో సరిపెట్టుకోని సదరు ఆకతాయి విద్యార్థులు.. ఆ మొత్తం వేధింపుల పర్వాన్ని వీడియో తీసి రీల్స్ చేశారు. ఆకతాయిల వేధింపులు తాళలేక ఆమె పుస్తకాన్ని ముఖానికి అడ్డం పెట్టుకోవడం వీడియోలో చూడొచ్చు.

విద్యార్థులు క్లాస్ రూమ్‌లో, స్కూల్ ఆవరణలో తనని వేధిస్తున్నారని.. మీ పిల్లలను అదుపులో పెట్టుకోండి అంటూ ఆ ఉపాధ్యాయురాలు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. తనను తన విద్యార్థులే వేధిస్తున్న వైనాన్ని ఆమె పోలీసులకు తెలిపారు. 

 

ఉపాధ్యాయురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఒక మహిళను వేధించి ఆమె పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడంతో పాటు ఆమె వీడియోను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసినందుకుగాను ముగ్గురు విద్యార్థులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగానే ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు మీరట్ పోలీసులు తెలిపారు.

Also Read : Girl Raped By Headmaster: బాలికపై నలుగురు మైనర్ల గ్యాంగ్ రేప్.. బాధితురాలిని రేప్ చేసి హెడ్ మాస్టర్

Also Read : Young Man Murdered: లవర్ పిలిచిందని వెళ్లాడు, విషం తినిపించి చంపిన ఫ్యామిలీ!

Also Read : Drilling in Hand: విద్యార్థి ఎడమ చేతికి డ్రిల్లింగ్ చేసిన టీచర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News