Women Kills Husband For Lover in Vishaka: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ ఇల్లాలు. అతడు అదృశ్యమయ్యాడంటూ అందరినీ నమ్మించబోయి చివరకు దొరికిపోయింది. విశాఖలో ఈ హత్య సంచలనం రేపింది. హత్య కేసును పోలీసులు ఎలా ట్రేస్ చేశారు..? నిందితులను ఎలా పట్టుకున్నారు..? పక్కాగా ప్లాన్ చేసినా వారు, పోలీసులకు ఎలా దొరికిపోయారు...? అనే వివరాల్లోకి వెళితే ఆమె పేరు జ్యోతి... వాసవానిపాలెం లో నివాసముంటుంది.
ఇక జ్యోతి భర్త పేరు పైడి రాజు, వారి పెళ్లి అయ్యి ఆరేళ్ల దాటింది. పైడి రాజు-జ్యోతి దాంపత్యానికి గుర్తుగా బాలాజీ , హర్షిత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పైడిరాజు టైల్స్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా జ్యోతి పెళ్లికి ముందే వాసవానిపాలెంలో పొరుగింట్లో ఉండే నూకరాజుతో సన్నిహితంగా ఉండేది. పెళ్లయ్యాక దూరమైనా ఇటీవల అతను మళ్లీ ఆమెతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. జ్యోతి అత్తవారిది ఉమ్మడి కుటుంబం కావడంతో అక్కడ కలుసుకోవడం కుదరదని వారిద్దరూ విశాలాక్షినగర్‌లో ఓ గది అద్దెకు తీసుకున్నారు.
నగరంలోని సీబీఐ కార్యాలయంలో హౌస్ కీపింగ్ పని చేస్తున్నానంటూ ఇంట్లోవాళ్లను నమ్మించి ఆరు నెలలుగా ప్రతిరోజూ ప్రియుడి గదికి వెళ్లి అతనితో గడిపి రాత్రి ఇంటికి వచ్చేది. కానీ ప్రియుడిపై మోజు ఎక్కువ కావడంతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని జ్యోతి పథకం వేసింది. గత నెల 29వ తేదీ రాత్రి పైడిరాజుకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి పెట్టి, రాత్రి ఒంటిగంట సమయంలో ప్రియుడు నూకరాజుకు ఫోన్ చేసింది.
అతడు తనకు సోదరుడి వరసయ్యే కె.భూలోకతో కలిసి వచ్చి ద్రలో ఉన్న పైడిరాజు మెడకు తీగ బిగించి హతమార్చారు. మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై మధ్యలో పెట్టుకుని విశాలాక్షినగర్‌లోని గదికి తరలించి అంబులెన్స్‌కు కాల్ చేసి తన స్నేహితునికి ఒంట్లో బాగోలేదని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. సిబ్బంది వచ్చి చూసి పైడిరాజు చనిపోయాడని చెప్పడంతో తనకు ఎవరూ లేరని నమ్మించి అదే వాహనంలో మృతదేహాన్ని పెద్ద జాలరి పేట సమీప వాసవానిపాలెం శ్మశానవాటికకు తరలించి గుట్టుగా దహనం చేసి, బూడిదను సముద్రంలో కలిపేశారు.
ఇంతా చేసిన తరువాత జ్యోతి తన భర్త కనిపించడం లేదంటూ భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ మృతుడి సోదరులు జ్యోతి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేయడం.. ఆమె సీబీఐ కార్యాలయంలో పనిచేయడం లేదని వారికి తెలియడంతో పోలీసులకు ఆమెపై అనుమానం బలపడింది. ఫోన్ కాల్స్ ఆధారంగా విచారించగా నూకరాజుతో ప్రేమాయణం బయట పడింది. తమదైన శైలిలో నిందితులిద్దరినీ విచారించగా పైడిరాజును హత్య చేసినట్లు అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని రిమాండ్ కు పంపారు.
Also Read: Veera Simha Reddy Collections: బాక్స్ ఆఫీస్ ఊచకోత అంటే ఇదేనేమో.. బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్!
Also Read: Similar Climax: తలలు నరికి శత్రువులను చంపిన 'వాల్తేరు-సింహారెడ్డి'లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook