Wrong Blood Group: రక్తం ఎక్కించే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. రక్తం గ్రూపు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాలే పోతాయి. తాజాగా రాజస్థాన్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఒక బ్లడ్ గ్రూపు వ్యక్తికి మరో బ్లడ్ గ్రూపు రక్తం ఎక్కించడంతో యువకుడు మృతి చెందాడు. వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో వైద్య సిబ్బంది తీరుపై కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నిర్లక్ష్యం కారణంగా అమాయకుడు చనిపోయాడని వాగ్వాదానికి దిగారు.
Also Read: Basara IIIT Student: బావ లేని బతుకు నాకొద్దు.. తనని కాల్చిన చోటే నన్ను కాల్చండి
రాజస్థాన్‌కు చెందిన సచిన్ శర్మ (23) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతడిని సమీపంలోని సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు రక్తం అవసరమని గుర్తించారు. వెంటనే రక్తం ఎక్కించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే రక్తం గ్రూపు విషయంలో కొంత తికమకపడ్డారు. సచిన్ రక్తం గ్రూపు ఓ- పాజిటివ్ ఉండగా ఆస్పత్రి సిబ్బంది ఏబీ-పాజిటివ్ రక్తాన్ని ఇచ్చారు. ఈ రక్తం ఎక్కించడంతో కొన్ని గంటలకే బాధితుడు తీవ్ర అస్వస్థతకు గురయి మరణించాడు. సచిన్ మృతి చెందడంతో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అతడు మృతి చెందడాన్ని ఆందోళన చేపట్టారు.
Also Read: Friend Fraud: స్నేహితుడి నమ్మకద్రోహం.. ఆపదలో ఉన్నాడని సహాయం చేస్తే ప్రాణమే తీశాడు
ఆస్పత్రిలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో వెంటనే ఆస్పత్రి అధికారులు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టగా విస్తుగొలిపే విషయం తెలిసింది. ఒక రక్తం గ్రూపు బదులు ఇతర రక్తం ఎక్కించడంతో సచిన్ శర్మ మృతి చెందాడని తేలింది. తప్పు రక్తం గ్రూపు ఎక్కించడం వలన సచిన్ రెండు మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమించి అతడు మృతిచెందాడు. ఋ సంఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి విచారణ చేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ అచల్ శర్మ తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
వాస్తవంగా ఓ-పాజిటివ్ అన్ని బ్లడ్ గ్రూపులకు ఇవ్వొచ్చు. కానీ ఓ పాజిటివ్ వ్యక్తులకు ఓ పాజిటివ్ రక్తం మాత్రమే ఇవ్వాల్సి ఉంది. అదికాకుండా ఏబీ-పాజిటివ్ రక్తం ఇవ్వడంతో ఈ దుర్ఘటన జరిగింది. రక్తం మార్పిడి చాలా సున్నితమైన విషయం. ఎలాంటి పొరపాటు చేసినా మనిషి ప్రాణానికే ప్రమాదం. అందుకే ఎవరి రక్తం గ్రూపు వారు తెలుసుకోవాల్సి ఉంది. ఆస్పత్రిలో సమయంలో స్పష్టంగా రక్తం గ్రూపు చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి