"రంగస్థలం" శాటిలైట్ రైట్స్‌కు ఫ్యాన్సీ రేటు

  

Last Updated : Nov 5, 2017, 05:24 PM IST
"రంగస్థలం" శాటిలైట్ రైట్స్‌కు ఫ్యాన్సీ రేటు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన "రంగస్థలం" చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడైపోయాయి అని తెలుస్తోంది. రికార్డు స్థాయిలో 18 కోట్ల రూపాయల ధర ఈ చిత్రానికి పలికినట్లు సమాచారం. గతంలో బాహుబలి చిత్రం మాత్రమే 30 కోట్ల రూపాయలకు స్టార్ మా టీవీకి అమ్ముడైపోయింది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న పవన్ కళ్యాణ్ చిత్రం కూడా 19 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు కొందరు సినీ ప్రముఖులు చెబుతున్నారు. దీని బట్టి వచ్చిన వార్తలు నిజమైతే.. రంగస్థలం కూడా అంత భారీ రేటుకి అమ్ముడైపోవడం విశేషమే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రంగస్థలం 1985" చిత్రంలో రామ్‌చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమయ్యే ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా సర్వత్త్రా ఆసక్తి నెలకొంది. 

Trending News