అమితాబ్, అలియాభట్‌ల కొత్త సినిమా..!

బిగ్ బి అమితాబ్ బచ్చన్, అలియా భట్ ప్రధాన తారాగణంగా వస్తున్న చిత్రం "బ్రహ్మాస్త్ర".

Last Updated : Oct 14, 2017, 05:17 PM IST
అమితాబ్, అలియాభట్‌ల కొత్త సినిమా..!

బిగ్ బి అమితాబ్ బచ్చన్, అలియా భట్ ప్రధాన తారాగణంగా వస్తున్న చిత్రం "బ్రహ్మాస్త్ర". ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందట. బహుశా.. కరణ్ కెరీర్‌లోనే ఎక్కువ బడ్జెట్ సినిమా ఇదే అవుతుందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ఫాంటసీ అడ్వెంచర్‌గా మూడు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతుందని నిర్మాతలు అంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చే ఈ చిత్రం తొలి భాగం 2019లో విడుదలవుతుందట. యాక్షన్ ప్రధానాంశంగా తెరకెక్కే ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ కూడా మరో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం ఆయన జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకుంటున్నారని వినికిడి. రణ్ బీర్ కపూర్ ఈ చిత్రం కంటే ముందు నటించిన జగ్గా జాసూస్ కూడా 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమే కావడం విశేషం. అయితే ఆ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. మరి భారీ బడ్జెట్‌తో వస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రం ఎంత వరకు బయ్యర్ల అంచనాలను అందుకుంటుందో వేచి చూడాల్సిందే. 

Trending News