Tollywood: టాలీవుడ్ కి ఫెంటాస్టిక్ వీకెండ్.. బింబిసార, సీతారామం సినిమాలకు సూపర్ హిట్ టాక్!

A Fantastic Weekend For Tollywood With Bimbisara and Sita ramam: రైన హిట్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద ఊరట లభించినట్లే.  సీతారామం, బింబిసార సినిమాలకు పాజిటివ్ టాక్ లభించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2022, 07:46 AM IST
Tollywood: టాలీవుడ్ కి ఫెంటాస్టిక్ వీకెండ్.. బింబిసార, సీతారామం సినిమాలకు సూపర్ హిట్ టాక్!

A Fantastic Weekend For Tollywood With Bimbisara and Sita ramam: చాలా కాలం నుంచి సరైన హిట్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద ఊరట లభించినట్లే. ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అయిన సీతారామం, బింబిసార సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో రెండు సినిమాలకు థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ రెండు సినిమాలు బాగా నచ్చడంతో మంచి కలెక్షన్లు కూడా నమోదయ్య అవకాశాలు కనిపిస్తున్నాయి.

కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన బింబిసార సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తన బావమరిది కొసరాజు హరికృష్ణ చేత నిర్మింప చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా సంయుక్త మీనన్, కేథరిన్ థెరిసా వంటి వారు నటించారు. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన్న, సుమంత్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన మరో చిత్రం సీతారామం. సూపర్ హిట్ చిత్రాల బ్యానర్ వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ సినిమాను అశ్విని దత్ కుమార్ స్వప్న నిర్మించారు. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే టాగ్ లైన్ తో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక అందమైన ప్రేమ కథను చూశామనే ఫీలింగ్ తో బయటకు వస్తున్నారు

చివరిలో కాస్త హృదయాలను బరువెక్కించేలా చేశారు కానీ చాలా కాలం తర్వాత ఒక ఫీల్ గుడ్ లవ్ మూవీ చూసిన థ్రిల్ కలుగుతోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు కూడా తెలుగు సినీ పరిశ్రమకు ఒకరకంగా ఊతమిస్తున్నాయనే చెప్పాలి. తెలుగు సినిమాలు ఎలా ఉన్నా థియేటర్లకు ప్రేక్షకులకు రావడం లేదంటూ నిర్మాతలు బాధపడుతున్న తరుణంలోనే ఇలా రెండు సినిమాలు అద్భుతమైన టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు కూడా భారీగానే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

Also Read: Nikhil Siddarth: నిఖిల్ కన్నీళ్లకు ఆ నలుగురే కారణమా.. వాళ్ల సినిమాలే విడుదలైతే..మిగతావాళ్లు ఏం చేయాలి!

Also Read: Hyper aadi: హీరోయిన్ తో ఆది రొమాన్స్.. ఏకంగా హగ్గుల దాకా వ్యవహారం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News