Nikhil Siddarth: నిఖిల్ కన్నీళ్లకు ఆ నలుగురే కారణమా.. వాళ్ల సినిమాలే విడుదలైతే..మిగతావాళ్లు ఏం చేయాలి!

Nikhil's Karthikeya 2 Movie Facing Theatres Issue: నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా జూలై 22న విడుదల కావాల్సి ఉంది కానీ ఆగస్టు 12కి వాయిదా పడింది. అయితే ఆరోజు నుంచి కూడా మరో రోజు వెనక్కు వాయిదా పడిన క్రమంలో బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల గురించి చర్చ జరుగుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2022, 04:49 PM IST
Nikhil Siddarth: నిఖిల్ కన్నీళ్లకు ఆ నలుగురే కారణమా.. వాళ్ల సినిమాలే విడుదలైతే..మిగతావాళ్లు ఏం చేయాలి!

Nikhil's Karthikeya 2 Movie Facing Theatres Issue: తాను హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా విడుదలయ్యేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ యంగ్ హీరో నిఖిల్ చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి. సుమారు 17 సినిమాలు చేసిన ఆయన సినిమాకే థియేటర్ల సమస్య ఏర్పడుతోందా అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
 
నిఖిల్ హీరోగా 2014 సంవత్సరంలో రూపొందిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పట్లోనే ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. అలా ప్రకటించిన దాని మేరకు కార్తికేయ సీక్వెల్ సినిమాని కూడా కరోనా సమయంలోనే మొదలు పెట్టారు.. ఇక ఎట్టకేలకు సినిమా అన్ని పనులు పూర్తిచేసుకుని జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధం అయింది. అయితే సినిమా ధియేటర్లు దొరకని నేపథ్యంలో సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.. అదే సమయానికి నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా కూడా విడుదలవుతున్న నేపథ్యంలో నిఖిల్ సినిమాను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

అప్పుడు వాయిదా వేసిన సినిమాని ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ బింబిసార సీతారామం సినిమాలు ముందే రిలీజ్ డేట్లు ప్రకటించడంతో ఆగస్టు మొదటి వారం వాటికి బ్లాక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో రెండో వారంలో 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఆ మేరకు సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయితే అప్పుడు కూడా సినిమాకు ఇబ్బంది ఏర్పడింది. నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో మళ్ళీ ధియేటర్ల సమస్య ఏర్పడడంతో మరో రోజు వెనక్కి వెళ్లి ఆగస్టు 13వ తేదీన విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సందర్భంగా నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాకు థియేటర్లు ఇవ్వడం లేదని అసలు సినిమా రిలీజ్ అవుతుందో అవ్వదో అర్థం కాని పరిస్థితుల్లో తాను కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని కూడా బయట పెట్టాడు.

జూలై 22 నుంచి ఆగస్టు 12వ తేదీ వాయిదా వేసిన సమయంలో కూడా ఆగస్టు 12న కూడా మీ సినిమా విడుదల అవదని, ఇప్పట్లో మీకు షోస్ దొరకవు థియేటర్లు ఇవ్వము, అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసుకోమని చెప్పారని అన్నాడు. తనకు హ్యాపీడేస్ మొదలు ఇప్పటివరకు ఇలా ధియేటర్లు దొరకక సినిమాలు ఆగుతాయనే విషయం తెలియదని నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. నిఖిల్ కామెంట్స్ విన్న నేటిజెన్లు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా నిలుస్తూ నిఖిల్ కామెంట్ చేసింది దిల్ రాజు గురించే అంటూ ఆయనని టార్గెట్ చేస్తున్నారు. అయితే దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమాను నిర్మించింది దిల్ రాజే.

కార్తికేయ 2, థాంక్యూ రెండు సినిమాల్లో కార్తికేయ 2 సినిమాకి మంచి బజ్ ఉండడంతో థాంక్యూ సినిమాతో పాటు అది కూడా విడుదలయితే థాంక్యూ సినిమాకి ఇబ్బంది అని భావించి ఎలాగోలా సినిమా వాయిదా పడేలా ఒప్పించారని టాక్ నడించింది. ఇక ఇప్పుడు నిఖిల్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం పరిస్థితి కూడా అలాగే ఉందని కామెంట్ చేస్తున్నారు. నిఖిల్ తండ్రి సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ గా అందరికీ సుపరిచితమే. ఆయన నిర్మాతగా కూడా అనేక సినిమాలు చేశారు. దిల్ రోజుతో కలిసి ఆయన అనేక సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. వీరిద్దరికీ ఉన్న సాన్నిహిత్యంతో నైజాం ప్రాంతంలో సినిమాకు థియేటర్లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. తద్వారా థియేటర్లు దొరకక నిఖిల్ సినిమా మరోసారి వాయిదా పడిందని అంటున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాలలో సినిమా ధియేటర్లు కేవలం నలుగురు నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయనే మాట చిన్న సినిమాల నిర్మాతలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.

కేవలం ఆ నలుగురే సినీ పరిశ్రమను నడిపిస్తున్నట్టుగా వాళ్లకు నచ్చిన సినిమాలనే విడుదల చేస్తూ ముందుకు వెళుతున్నారు అనే కామెంట్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఒక హీరో ఇలా ముందుకు వచ్చి మాట్లాడటం అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయాలు నిఖిల్ ఎక్కడా బయట పెట్టలేదు కానీ నెటిజన్లు మాత్రం దిల్ రాజు సహా టాలీవుడ్ లో మరికొందరు నిర్మాతలే ఈ పరిస్థితికి కారణం అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిఖిల్ ఏ ఇంటర్వ్యూలో అయితే థియేటర్లు దొరకక తన సినిమా నిలిచిపోతుందని భావించి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పాడో అదే ఇంటర్వ్యూలో దిల్ రోజు సహా ఏసియన్ సునీల్ వల్లే తన సినిమాకు థియేటర్లు దొరికాయని వాళ్లకు థాంక్స్ చెప్పడం.

అయితే ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత కూడా నిఖిల్ సినిమా ఒకరోజు వెనక్కి వెళ్ళింది. ఇంటర్వ్యూ ఇచ్చేనాటికి నిఖిల్ సినిమా 12వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ దానిని ఇప్పుడు 13వ తేదీకి మార్చారు కార్తికేయ 2 సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలలో అనుపమ్ ఖేర్,ఆదిత్య మీనన్, శ్రీనివాస్ రెడ్డి, సత్య, ప్రవీణ్ అలాగే హర్ష చెముడు వంటి వారు నటించారు. ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్లు అలాగే పోస్టర్లు సినిమా మీద ఆసక్తి పెంచేశాయి. గుజరాత్లోని శ్రీకృష్ణుడి రహస్యాలను దాచుకున్న ద్వారక నేపథ్యంలో ఈ సినిమా సాగబోతుండదనంతో సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బహుశా ఈ పాజిటివ్ టాక్ నిఖిల్ సినిమాకు థియేటర్లు కరువయ్యేలా చేసిందేమో?

Also Read: కల్యాణ్‌ రామ్ అన్నా.. రాజుగా నిన్ను ఎవరూ భర్తీ చేయలేరు! బింబిసారపై ఎన్టీఆర్‌ రివ్యూ

Also Read: Bimbisara: కలిసొచ్చిన ‘పాప’ సెంటిమెంట్.. అఖండ, ఆర్ఆర్ఆర్ బాటలోనే బింబిసార!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News