‘ఆచారి అమెరికా యాత్ర’ ట్రైలర్‌ రిలీజ్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. 

Last Updated : Jan 20, 2018, 02:39 PM IST
‘ఆచారి అమెరికా యాత్ర’ ట్రైలర్‌ రిలీజ్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ‘నవ్వుల యాత్ర ప్రారంభం’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ చిత్రానికి జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కథ అంతా బ్రహ్మానందం పాత్ర చుట్టూనే తిరగడం విశేషం. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ని యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు నిర్మాతలు. రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని ఇప్పటికే తెలిపారు ఈ చిత్ర నిర్మాతలు.  పద్మజ పిక్చర్స్‌ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ బాణీలు సమకూర్చారు. ప్రభాస్ శ్రీను, ప్రవీణ్, పోసాని క్రిష్ఱమురళి, ప్రదీప్ రావత్, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది

Trending News