Dasari Arun Kumar Arrest: మద్యం మత్తులో భీభత్సం.. దాసరి నారాయణరావు కుమారుడు అరెస్టు

Dasari Arun Kumar Arrest: టాలీవుడ్ కు చెందిన నటుడు దాసరి అరుణ్ కుమార్ మద్యం మత్తులో వాహనాన్ని భీభత్సం సృష్టించాడు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొన్నాడు. బాధితుల ఫిర్యాదు అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 03:46 PM IST
    • దాసరి నారాయణ రావు కుమారుడు అరుణ్ అరెస్టు
    • మద్యం మత్తులో రెండు ద్విచక్రవాహనాలను ఢీ
    • బాధితుల ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు
Dasari Arun Kumar Arrest: మద్యం మత్తులో భీభత్సం.. దాసరి నారాయణరావు కుమారుడు అరెస్టు

Dasari Arun Kumar Arrest: తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ అరెస్టు అయ్యాడు. మద్యం మత్తులో ఓ ద్విచక్ర వాహానాన్ని ఢీకొన్న కారణంగా దాసరి అరుణ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పోలీసుల ఆధీనంలో ఉన్నారు. 

ఏం జరిగిందంటే?

టాలీవుడ్‌కు చెందిన నటుడు దాసరి అరుణ్ కుమార్ మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాన్ని న‌డిపి బీభ‌త్సం సృష్టించారు. బుధ‌వారం రాత్రి హైదారాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబ‌ర్ 12లో మ‌ద్యం సేవించి కారు న‌డిపించారు. ఈ క్ర‌మంలోనే రోడ్ నెంబ‌ర్ 12 స‌య్య‌ద్ న‌గ‌ర్‌లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప‌లు బైక్‌ల‌ను ఢీకొట్టారు. 

దీంతో స్థానికులు బంజార‌హిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వెంట‌నే సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు గురువారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల స‌మ‌యంలో అరుణ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అరుణ్‌ కుమార్ ను ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డిపిన‌ట్లు తేలింది.

దీంతో అరుణ్ కుమార్‌పై డ్రంక‌న్ అండ్ డ్రైవింగ్ చ‌ట్టం 1988 ఐపీసీ సెక్ష‌న్ 185, 304ల కింద కేసు న‌మోదు చేసుకున్న పోలీసుటు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే సినీ ప్ర‌ముఖుడు దివంగ‌త దాస‌రి నార‌యాణ రావు వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అరుణ్ కుమార్‌.. 'గ్రీకు వీరుడు', 'ఆదివిష్ణు', 'చిన్నా' వంటి చిత్రాల్లో న‌టించాడు.  

Also Read: Varun Tej Lavanya Marriage: నటి లావణ్యతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి.. నెట్టింట ప్రచారం!

Also Read: Akhanda Movie Collection: 50 రోజులు పూర్తి చేసుకున్న అఖండ.. రూ.200 కోట్ల కలెక్షన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News