Karwa Chauth 2021: భార్యకు బీఎండబ్ల్యూ బహూకరించిన బాలీవుడ్ నటుడు

Karwa Chauth 2021: ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా కర్వాచౌత్‌ వేడుకలను ఉత్తరాదివాసులుతోపాటు బాలీవుడ్ ప్రముఖలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకను పురస్కరించుకుని బాలీవుడ్‌ నటుడు గోవింద తన సతీమణి సునీతకు ఓ ఖరీదైన బహుమతిని అందించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2021, 04:55 PM IST
Karwa Chauth 2021: భార్యకు బీఎండబ్ల్యూ బహూకరించిన బాలీవుడ్ నటుడు

Karwa Chauth 2021: ఉత్తరాదివాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ..కర్వాచౌత్(Karwa Chauth 2021). ఏటా దీపావళికి పది రోజుల ముందు ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ పండగను పురస్కరించుకుని మహిళలు తమ జీవిత భాగస్వామి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఉపవాస దీక్షకు పూనుకుంటారు. అదేవిధంగా తమ భర్త ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక పెళ్లికాని అమ్మాయిలైతే తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తారు. ఉత్తరాది ప్రజలతో పాటు బాలీవుడ్‌(Bollywood)కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ ఫెస్టివల్‌ను ఘనంగా చేసుకున్నారు.

Also Read: 67th National Film Awards: 'జెర్సీ', 'మహర్షి' సినిమాలకు గానూ నేషనల్​ అవార్డ్స్​ అందుకున్న దర్శకనిర్మాతలు

‘కర్వా చౌత్‌’ పండగ(Karwa Chauth Festival)ను పురస్కరించుకుని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవింద(Govinda) తన సతీమణి సునీతకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారు(BMW Car)ను బహుమతిగా అందించాడు. ‘'నా ప్రాణ స్నేహితురాలు..నా జీవిత భాగస్వామి…నా ఇద్దరు అందమైన పిల్లలకు తల్లి.. నీపై నాకున్న ప్రేమ వెలకట్టలేనిది. అయినా కర్వాచౌత్‌ను పురస్కరించుకుని ఒక చిన్న బహుమతిని అందిస్తున్నాను' అంటూ కారును గిఫ్ట్‌గా అందిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Govinda (@govinda_herono1)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x