Nani New Movie: మరో కొత్త దర్శకుడికి నాని గ్రీన్ సిగ్నల్.. అలాంటి ఎగ్జయిట్మెంట్ తోనే!

Actor Nani Movie Confirmed With New Director: హీరో నాని తన తదుపరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాను ఆయన ఒక కొత్త దర్శకుడి డైరెక్షన్లో చేయబోతున్నారని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 18, 2022, 12:31 PM IST
Nani New Movie: మరో కొత్త దర్శకుడికి నాని గ్రీన్ సిగ్నల్.. అలాంటి ఎగ్జయిట్మెంట్ తోనే!

Actor Nani Movie Confirmed With New Director: చివరిగా శ్యామ్ సింగరాయ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నాని ఇప్పుడు దసరా అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణలోని సింగరేణి గనుల నేపథ్యంలో సాగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని లుక్స్ అలాగే పోస్టర్లు సినిమాలో నాని ఒక పూర్తి స్థాయి మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది.

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం నాని పూర్తిస్థాయి తెలంగాణ మాండలికాన్ని కూడా నేర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత కూడా నాని ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ నానికి బాగా నచ్చడంతో ఆయనకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దర్శకుడు ఎవరనే విషయం మీద క్లారిటీ లేదు కానీ త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.

నాని సదరు దర్శకుడితో కాంబినేషన్లో సినిమా చేసేందుకు ఒక ప్రఖ్యాత ప్రొడక్షన్ హౌస్ కూడా సిద్ధమైందని హీరోయిన్ అలాగే ఇతర నటీనటులను కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత అధికారికంగా సినిమాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కథ నచ్చడంతో పూర్తిస్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని రమ్మని దర్శకుడికి నాని చెప్పారని అంటున్నారు. నాని ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో ఆయన చేసిన ఆ, హిట్ వంటి సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు నాని నిర్మాణంలో హిట్ సినిమా రెండో భాగం రూపొందుతోంది. మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా రెండో భాగంలో మాత్రం అడవి శేషు హీరోగా నటిస్తున్నాడు.

Also Read: Kabzaa Teaser: ప్రతి ఫ్రేమూ కేజీఎఫ్ లానే.. ఇన్స్పిరేషనా ఇంకేమన్నానా!

Also Read: God Father Movie: అసలు గాడ్ ఫాదర్ రిలీజవుతుందా? ఎందుకీ మౌనం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News